కలగంటినే నేను కలగంటినే
కలలోన తల్లిని కనుగొంటినే
ఎంత బాగున్నదో నా కన్నతల్లి
ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించె మళ్ళీ
కలగంటినే…
మెడలోన అందాల మందారమాల
జడలోన మల్లికా కుసుమాల హేల
ఎంత బాగున్నదో నా కన్నతల్లి
ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించె మళ్ళీ
కలగంటినే…
కంచి కామాక్షియా ,కాకున్ననేమి!
కాశి విశాలాక్షి కాకూడదేమి ?
కనుగొంటినే నేను కనుగొంటినే
ఆమె ఎవరో కాదు భారతమాత !
ఆమె ఎవరో కాదు భారతమాత!
కనుగొంటినే నేను కనుగొంటినే
కలలోన తల్లిని కనుగొంటినే