నాకు పరిచయమైన వ్యక్తులలో నాకు స్పూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలబడ్డ స్త్రీలు చాలా మందే వున్నారు! ఒక్కొక్కరూ, నన్ను చాలా అబ్బురపరచి, వీళ్ళని చూసి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి అని అనిపిన్స్తుంది. అందులో కమలమ్మగారు ఒకరు! వయసు ఈవిడది ఇంకా డెబ్భై ఆరే! అయితే అవిశ్రాంతంగా క్రోషీయా సూది ఈవిడ చేతిలో కదులుతూనే వుంటుంది!అయితే చేతులెలా పని చేస్తుంటాయో అలాగే కళ్ళు టీవీని చూస్తుంటాయి-క్రికెట్ మొదలుగొని అన్ని భాషలలోనూ,అన్ని చానెల్స్లోని అన్ని ప్రోగ్రాంస్ ని ఒకేసారి కిచిడిలా చూసేస్తుంటారు.ఇంకా సుడుకోలు హిందు పేపర్లోవి పూర్తిచేస్తుంటారు. ఇవి కాక గడి-నుడి.మొత్తాని భలే అత్తమ్మ ఈవిడ!ఈవిడ కోడలుగారు ఈవిడికి తీసిన ఫొటో నేను మీముందుంచుతున్నాను అంతే! ఇంతకీ ఈవిడ ఎవరో చెప్పలేదు కదూ! ఈవిడ మా రెండో అక్కకి శకుంతలకి (chakralawordpress.com)కి అత్తగారూ! నాకు అమ్మనూ!

మీనాక్షి కూనిరాగాలలో నుడికారాలు బాగున్నాయ్. మన చుట్టూ వున్న వ్యక్తుల్లో ప్రతిభలను బ్లాగు ద్వారా పరిచయం చేసిన నీ ప్రయత్నం బాగుంది. శ్రీమతి కమలమ్మ గారి హస్త కళా వైభవం బాగుంది. వారి పరిచయం… చేసిన మీకూ,వారికి నా అభినందనలు….నూతక్కి