ఏ మొక్క లేనప్పుడు ఆముదం మొక్కే, మహా వృక్షమండీ బాబు! అందుచేత,ఇంట్లో వున్న వస్తువులతో,మనం కూడా ఓ వంట సృష్టించేసాం.దీనిని ఇంతకముందు ఎవరన్నా చెప్పారో,చేసారో నాకు తెలియదు. నాకు అప్పటికప్పుడు తోచింది,చేసాను.ఇది చాలా వీజీ అండీ!ఓసారి చూడండి.
కావల్సిన పదార్ధాలు:-సేమ్యా-1కప్పు,బియ్యప్పిండి-2కప్పులు, పచ్చి మిర్చి-3,కొత్తిమీర, అల్లం-చిన్న ముక్క,ఉప్పు -తగినంత.
మూకుడులో రెండు చెంచాలు నూనె వేసి సేమ్యాని వేయించండి. తరువాత మూడు కప్పులు నీళ్ళు పోసి,సేమ్యాని ఉడికేలాగా చూడండి.సేమ్యా ఉడుకుబట్టిన వెంటనే దింపేసి,ఉప్పూ, పచ్చి మిర్చి,అల్లం, కొత్తిమీర కలిపేసి, బియ్యప్పిండిని కూడా కలిపేసి దోసె పిండిలాగ తయారు చేసి దోసెలు పోయండి.ఉల్లిపాయలు మామూలే-కావలిసితే కలుపుకోండి.అన్నట్లు కాస్త పుల్లపెరుగు కూడా నీటితో కలిపితే బాగుంటుంది. ఇంతే సంగతులు–దోసె కడుపులోకి, మనం వీజి చైర్లోకీనూ!
అశ్వనీ శ్రీ గారు, వీజీ చైరు ఎదురుగ్గా టివి కూడా వుండాలేతండీ సెప్పనే లేదు .వంటకం శాన వీజీగా ఉందండి.
అభినందనలు అశ్వనీ శ్రీ . ..శ్రేయోభిలాషి …నూతక్కి