ఆయ్! మరేమోనూ మనమేమో కలుసుకుని సానా రోజులైపోతుండాది! బాగుండారా! మీ అసుంటి పెద్దమడుసుల్ని కలుసుకోవాలంటే, ఒకింత తీరిక, మరో కూసింత ఎసులుబాటు వుండాలి కాదెటండీ!మరందుకే, ఈలు కుదరనేదూ అని సెప్పుకుంటున్నాను.అద్సరేగాని!ఈ పెళ్ళిళ్ళు సేసేసుకోడం, మనం “హమ్మయ్య!అయ్యింది!!!” అనుకునే లోపుల్నే ఇడిపోడం! సంగతి! ఆయ్! కారణమేటో తెలుసునేటండి మీకూ? ఆ! నా పిచ్చిగానీ మీరూ–పెద్దోరూ! మీకు నే సెప్పేదెమిటి గానీ! నాకూ తెలుసూ– అని నేననుకుంటే వొచ్చేసిన నష్టమేటీ పెద్దగా లేదనిపించీ, మరి మనం మన మనసులో మాట సెప్పేస్తున్నామండి!ఇషయం అర్థమైంది కాదేటండి! ఇహ రేపు ఓ పాలి ఈ ఇసయం మీద మీతో మొరీట్టుకుంటానండి! సెలవనేసుకుందామేటో!!కంగారుపడాల్సినదేటినేదండీ ఇసయం ! ఏదో ఒకింత ఊరుకో బుద్దికాక! మీ బాసలోనైతే బుద్ది లేకానూ…!