Monthly Archives: జనవరి 2009

మీనాక్షి కుంచె కులుకులు-1(లాలన )

                                         లాలన

           ఇది కొబ్బరి మట్టపై నే గీసిన ఆయిల్ పెయింటింగ్

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కూనిరాగాలు–8

మీనాక్షి కూనిరాగాలు–8
నువ్వు మా మీనాక్షివేనంటూ నాకు టప టపా టపాలందించేస్తున్న బ్లాగ్ మిత్రులందరికీ నానుంచి వచ్చే స్నేహ సందేశం ఇది. పాటలో ప్రణయ సందేశం అని వున్నా నాది మాత్రం ఏడుకొండలెక్కిన శ్రీవారి శ్రీపదముల సాక్షిగా స్నేహ సందేశమే!పాట రచయత ఎవరో నాకు తెలియదు. అఙ్ఞానానికి మన్నించాలి.
“వెళ్ళిపోయే వెన్నెలయ్యా
మళ్ళివచ్చేదెన్నడయ్యా
నిఖిల జగమున నీవు మాత్రం నెచ్చెలివి నాకూ,
నెచ్చెలివి నాకు.

నీవు వెళ్ళే దారిలోనా,నీకు మల్లె అందమైన
కన్నె ఒకతి నిదురపోతు, కనిపిస్తుంది
కన్నె ఒకతి నిదురపోతు, కనిపిస్తుందీ

                      వెళ్ళిపోయే వెన్నెలయ్యా

ఆమె నిదుర స్వప్నవీధుల అటులాటుల మెల్లగ దిగి
ప్రియుడు పంపే ప్రణయ సందేశం ఆమె కెరిగించూ,
ఆమె కెరిగించు.
                      వెళ్ళిపోయే వెన్నెలయ్యా

తన్ను నేను మరువలేదని కాని ఇప్పుడు కలుసుకొనుటకు
వీలుపడదని మాత్రమామెకు విన్నపాలు సేయి,
వీలుపడదని మాత్రమామెకు విన్నపాలు సేయి.
                      వెళ్ళిపోయే వెన్నెలయ్యా

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి లేఖలు-3

ప్రియమైన కృష్ణ యామినీ!
ఛాలా రోజులైపోయింది నీకు ఉత్తరం రాసి, పైగా మనసులో మాట చెప్పుకునేందుకు నాకు నీకంటే ఎవరున్నారు?అయితే ఈ మధ్య  తప్పనిసరిగా వెళ్ళాల్సిన కొన్ని విందులకి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఉత్తరం రాసెందుకు అవకాశం కుదరలేదు.నేను రాను మొర్రో అంటే వినకుండా “బాగుండ”దంటూ వెంటేసుకెళ్ళారు మావారు. అక్కడి నుంచి మొదలు నాకు అవస్తలు. రాని చిరునవ్వులని మొహమ్మీద అతికించలేకా, అవతలి వారు కూడా అదే అవస్థ వుండడం గమనించి వారి ప్రక్కన కూచోలేక! సంభాషణ మొదలేస్తే- -మీరు మా ఇంటికి రాలేదు గనుక మేం మీ ఇంటికి రాము. మేము మీ ఇంటికి రావాలంటే మమ్మల్ని ఫోన్ చేసి పిలు, లేదా ఇంటికి వచ్చి పిలు. మేం మీ ఇంటికి ఒకసారి వస్తే మీరు మా ఇంటికి ఓసారి రావాలి.పైకి చెప్పకూడదు గాని మేం మీకు స్వీట్ ప్యాకెట్ తెస్తే మీరు మాకు పళ్ళు తేవాలి. వాట్ సొర్ట్ ఆఫ్ బ్లడి రిలేషన్షిప్  మైంటెనెన్స్ ఈస్ దిస్?అంటే మన సంబంధబాంధవ్యాలలో కమర్శియలిజం తారస్థాయికి చేరుకుందన్న మాట.అందుకు ఆ సంబంధ బాంధవ్యాలు మైంటైన్ చేయడానికి బార్టర్ ట్రేడింగ్ లాంటి ఇచ్చి పుచ్చుకోడాలు మొదలైయ్యాయి.అంతే కదూ! నువ్వు నాకు ఏదో శుభం జరిగి పార్టి ఇస్తే నేను దానికి బదులుగా నిన్ను ‘మా కుక్క మొరిగిందనో’ ‘పిల్లికి పిల్లలు పుట్టాయనో’… ఏదో వంక తో పార్టీ అరేంజ్ చేసి పిలవాలి.
చాలా బాధాకరమైన విషయం ఏమిటంతే ఈ విధమైన రిలేషన్షిప్ మైంటెనెన్స్ అతి సన్నిహితమైన భార్యాభర్తల బాంధవ్యంలోకీ, తోబుట్టువుల సంబంధాల్లోకీ కూడా చొచ్చుకునిపోయింది.నన్నడిగితే అందుకు మొదలైయ్యాయి ఈ స్ట్రెస్ సంబంధిత మానసిక వ్యాధులన్నీ కూడా.అవే విడాకుల దాకా కూడ పరిగెడుతున్నాయి.
చిన్నప్పటి నాకు ఒకటే తెలుసు. నువ్వు నా రిబ్బన్ కుచ్చు లాగేస్తే నేను నీ పుస్తకం అట్ట చింపేస్తే–ఎవరైనా నన్ను ‘ఒసై’అంటే నేనూ అదే తిరిగి అనేస్తా–అయితే ఒక చిన్న సమస్య ఇక్కడ వుంది.
వాళ్ళలా నన్ను ఎందుకు చేయాలనుకుంటున్నారు అని నేనెప్పుడూ ఆలోచించలేదు.నన్నంటే నేనంటా,నువ్వు చేస్తే నేను చేస్తా,నువ్వు వస్తే నేనొస్తా –అంటూ ముందుకు సాగడమే తప్పితే!ఇదే పరిస్థితీ, మనస్తత్వమూనూ అక్కడున్న అందరిదీని.నాకు నువ్వున్నావనే మినహాయింపు తప్పితే, నేను కూడా అక్కడున్నవారందరితోనూ అదే విధంగా వుంటాను. నీకూ నాకూ మధ్యన పాతికేళ్ళు పొరపొచ్చలు లేకుండా సాగిపోయాయంటే, అక్కడ ఇంకా ఈ కమర్షీలిజం ప్రవేశించలేదు.నేనెప్పుడైనా నీ ఇంటికి వస్తాను. నువ్వు పెట్టిన సాంబారు తింటాను( మర్చిపోనమ్మా నువ్వూ నేనూ కలసి తయారు చేసుకున్న కుళ్ళు ఉల్లిపాయల సాంబారు.హ!హ!హ!)
సర్లే! రెండు వైపులా అంతే అయినప్పుడు బాధెందుకూ?అంటావా– నేనిముడ్చుకోలేకపోతున్నాను. ఏమి చెయ్యమంటావు? అందుకే నీ దగ్గర కక్కేస్తున్నాను. అయితే ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంతే నిన్ననే నా ఇల్లు వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది.ఇదే విధంగా బాధపడుతూ. సో! లక్ష్మి మారింది. నేనూ మారతాను. ఇంకొంత కాలంలో అంతా మారవచ్చు. అదీ సంగతి!
ఎప్పుడొస్తావని నిన్ను నేనడగను. నీ చిత్తమే నా భాగ్యము…
                                               ఇట్లు
                                               మీనాక్షి.

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-7

మీనాక్షి కూనిరాగాలు-7
‘మబ్బు దిండు చిట్లినట్లు …’ అంటూ ఈ మధ్యనే ఓ బ్లాగ్ లో కవిత చూసాను.దాంతో ఈ పాట గుర్తుకు వచ్చింది. రచయత ఎవరో తెలియదు. అందుకు మన్నించాలి. ఇకపోతే ఈ పాటని చిన్నప్పుడెప్పుడో ‘ఈ పాట నేర్చుకుందాం’ శీర్షికన ఆకాశవాణి విజయవాడ వారందించినట్లు గుర్తు.
“మెరుపుల పూవ్వుల దండగా
మబ్బులు మెత్తని దిండుగా
గగనము వెచ్చని శయ్యగా
హాయిగ నుందువె తారకా, హాయిగ నుందువె తారక.

తెల్ల తామరల మాలతో, నల్ల కలువ చేలాలతో
సరసీ సౌధం చేరగా,
రావే రంగుల తారకా,రావే రంగుల తారక.
                            మెరుపులపూవ్వుల…
జాబిలితోనే ఆడవా?
వెన్నెలలోనే పాడవా?
వగలంటేనే కోరి కా ?
జగతికి రావే తారక!
జగతికి రావే తారక!
                           మెరుపుల పూవ్వుల…”

1 వ్యాఖ్య

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-6

నండూరి వారి ఈ పాటను గూర్చి మీనాక్షి కృష్ణ శాస్త్రి గారి పాట బ్లాగించి నప్పుడు ప్రస్తావించింది గనుక ఇదిగో ఆ పాట:-
“లేపకే లేపకే నా ఎంకి లేపకే నిదురా
ఈ పాటి సుఖమునేనింతవరకెరుగనే
లేపకే లేపకే నా ఎంకి లేపకే నిదురా

కలలోన నా ఎంకి కథలు సెపుతుండాది
ఉలికులికిపడుతూనే ఊకొట్టుతున్నానే
                             లేపకే…
కథలోని మనమల్లే కాసింతలో మారి
కనికట్టు పనులతో కథ నడుపుతున్నానే
                             లేపకే…
తెలివిరానీయకే కల కరిగిపోతాది
ఒఖ్ఖ నేనే నీకు పెక్కు నీవులె నాకు
ఒఖ్ఖ నేనే నీకు పెక్కు నీవులె నాకు
                             లేపకే…

ఈ అనంత పథాన ఏ చోటికాచోటులో దేవులపల్లి వారికి తాను ఇష్టపడ్డవారి అడుగు సవ్వడులు వినిపిస్తే, నండూరి వారి నాయుడు బావకి కలలో ఇలలో అంతా ఎంకి సహవాసమైపోయింది. పోలిక కనిపిస్తోందా మరి!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-5

మీనాక్షి ఈ రోజు దేవులపల్లివారిని గుర్తుచేసుకుంటోంది. ‘జగమెరిగిన బ్రాహ్మణునికి జందమేల..’అన్నట్లు ఆయనని మరచేవారు ఆంధ్రులలో వుండరు -అనడం అతిశయోక్తి ఏమీ కాదు.
సరే ఇదిగో పాట:-
‘నా నోట నీ మాట గానమయ్యే వేళ
నా గుండె నీవుండి మ్రోగించవా వీణ.

రాగమెరుగని వీణ, రక్తి నెరుగని వీణ
తీగపై నీ చేయి, తీయకే ఘడియేని
అంతరాంతరమున అమృతవీణే అయిన
మాట కీర్తనమౌను, మణికి నర్తనమౌను(2)
                      నా నోట నీ మాట…
ఈ అనంతపధాన ఏ చోటి కా చోటు
నీ ఆలయమ్మౌను, నీ ఓలగమ్మౌను
అడుగడునకు స్వామి అడుగు సవ్వడి వినిన
యెడదలోలోన ఎల్లెడల విశ్వమ్ము లోన (2)
                       నా నోట నీ మాట… ‘
‘ఈ అనంతపధాన ఏ చోటి కా చోటు, నీ ఆలయమ్మౌను నీ ఓలగమ్మౌను.. ‘– చూసారా మరి! మనం ఆరాధిస్తే భగవంతుడు కావచ్చు ప్రేమికుడు కావచ్చు ఎవరైనా సరే! మనం చూడాలనుకున్న చోట కావాలనుకున్న చోట కొలువు దీర వేంచేస్తారు.అదీ కథ! నండురివారి ‘వొఖ్ఖ నేనే నీకు, పెక్కు నీవులె నాకు ‘ అన్న వాక్యానికీ పై భావనకూ పోలిక వున్నట్లు కనిపిస్తోంది కదూ! ఏదైతేనేం విని ఆనందించడానికి ఇది ఓ మంచి పాటే!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి లేఖలు-2

ప్రియమైన కృష్ణ యామిని,

 భూమి ఎప్పుడూ గుండ్రంగానే వుంటుంది. ఆధునిక మహిళలము మేము అన్నిట స్వేచ్ఛా స్వాతంత్ర్యాలననుభవిస్తున్నామనుకుంటూ ఈ రోజున మనని మనమే మోసంచేసుకుంటున్నాము. నిన్న మా పనిమనిషి తన గోడు వెళ్ళబోసుకుంటుంటే నాకు అలా తోచింది. మా పార్వతి రెండు ఏళ్ళ క్రితం తన పెద్దకూతురికి అన్ని లాంఛనాలతోటీ పెళ్ళి చేసింది, అప్పు చేసి మరి. ఆ తరువాత ఆ అమ్మాయి పురిటి ఖర్చులూ, చంటి పిల్ల బాగోగులు అడపా దడపా అల్లుడి ముచ్చట్లూ అన్ని ఈమే భరిస్తొంది. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళవక మునుపు ఈమే కూతురుని మాత్రమే భరించేది ఇప్పుడు అల్లుడిని అతడి కూతురునీ కూడా భరించుతోంది. పార్వతి మొగుడు సంపాదించినది అతని అలవాట్లకీ, అతని ఖర్చులకీ సరిపోతుంది. అందుకే ఈమె ఓ పదిళ్ళలో పాచిపని చేస్తొంది.ఇంటి ఖర్చులు చూసుకోవడమంతా ఈమె వంతు. ఎన్నడన్నా అతగాడిస్తే అది ఈమెకు పండగ. తను సంపాదిస్తున్నది సరిపోకపోతే ఇంకొక గంట ముందు లేచో, లేక ఇంకొక గంట మధ్యాహ్నం ఆలస్యంగా వెళ్ళో మరో రెండు ఇళ్ళు ఒప్పుకుంటుంది.
పులి మీద పుట్రలాగా ఇప్పుడు ఆ అల్లుడికి ఇంకొక కోర్కె పుట్టింది. తన మావ చుట్ట కాలుస్తూ కూర్చున్నట్లే తనూ ఆ సుఖం అనుభవించాలనుకున్నాడు. దాంతో తన భార్యని ‘నువ్వు మీ అమ్మలాగ పని చెయ్యీ అంటు వేధిస్తున్నాడు. ‘అసలే బలహీనంగా వుందీ,పైగా పాలు తాగే పిల్లనొదిలేసి ఏం పనిచేస్తుందమ్మ నా బిడ్డ! అందుకే చేస్తున్నాని చెప్పు, ఆ మూడొందలూ నేనే ఇస్తా’నని చెప్పానమ్మా –అని వాపోయింది.’దానికి ఏదైనా వస్తే మళ్ళీ ఆ ఖర్చులు నేనెక్కడ భరించగలనూ? ‘ అని తల్లడిల్లింది.
నాకెక్కదో మెలిపెట్టినట్లైయింది. కూలివాడైనా, క్లాస్ ఒన్ ఆఫీసరైనా, గుమాస్తా అయినా, వ్యాపారి అయినా భార్య ఇంట్లో కూర్చోడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. పెళ్ళిచూపులప్పుడే వుద్యోగస్తురాలు కావాలని కోరుకుంటున్నారు. ఆమె సంపాదన వేనీళ్ళకి చన్నీళ్ళలా వాడుకునే భర్త దొరికితే అది ఆ పిల్ల అదృష్టం. లేకపోతే అది ఆమె ఖర్మ. అతడి సంపాదన మీద సర్వహక్కులూ అతనివి.దానాలైనా చేయ వచ్చు. దురలవాట్లైనా అలవాటు చేసుకోవచ్చు. ఈమె అవసరాలు, ఇంటి అవసరాలు ఈమె బాధ్యత. దీనిలో వాగ్వివాదాలకీ, ప్రశ్నోత్తరాలకీ తావు లేదు.నీకేమనిపిస్తొంది ఇప్పుడు. మనది పితృస్వామ్యమా? మాతృస్వామ్యమా? మనం ఆధునికత్వం పేరిట వున్నత స్థానాన్ని పొందుతున్నామా? అధోగతి పాలౌతున్నామా?
ఈ ప్రశ్నలకు బదులేది?
ఇది కాలం మీద ఆధారపడివుందేమో! నేను మాత్రం మా పార్వతికి చేయగలిగిందేమున్నది? అటూ ఇటూ చేసి ఒక పదో పరకో పెంచడం తప్పితే! ఇప్పటికింతే సెలవా మరి.
                                  ఇట్లు,
                                  ంఈనాక్షి.

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized