Monthly Archives: ఫిబ్రవరి 2009

మీనాక్షి కుర్ కురే-4(కొంచెం వాస్తవికత-కొంచెం అతిశయోక్తి)

                              ఒఖ్ఖ మగాడే!

కళాకారుడికిది సహజమనుచు
కాంతల సదస్సులకై ప్రాకులాడి
చెంత తన ఇంతియుండిననూ ప్రయత్నించును పరకాంతల ప్రాపకమునకై
గమనిస్తిరా మీరితడిని? ఇతడూ ఒఖ్ఖ మగాడే!

యే జోభి హై ,ఇన్ కీ మెహఫిల్ మే  జర హోషియార్ రెహనా బెహన్ జీ!
“ఖతరా-ఖతరా-ఖతరా హై”, యే బాత్ బోల్ రహీ హై ఆప్ కీ  మీనాక్షి!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కూనిరాగాలు-15

ఈ పాట కూడా శ్రీ చిత్తరంజన్ గారు “ఈ పాట నేర్చుకుందాం” శీర్షికన నేర్పించినదే. రచయిత దేవులపల్లి అని గుర్తు. ఖచ్చితముగా తెలీదు.మీరూ విన్నారేమో ఓ సారి గుర్తు చేసుకోండి.

“కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాసికై
దయచేసి నావయా
హర హరా హర హరా హర హరా(2)!

విరిసె జాబిలి మల్లెరేకుగా
కురిసె తేనియలు మొవ్వాకుగా
దరిసి నీ దయ నిండు గోదావరీ
నదీ ఝరులాయెరా హర
హర హరా హర హరా హర హరా హర హరా(2)!

                                       కైలాసగిరి నుండి కాశికై
                              

ముక్కోటి దేవతల నేతరా
ముల్లోకముల కిష్టదాతరా
వెలిబూది పూతరా,
హర విషపు నేతరా!
హర హరా హర హరా హర హరా హర హరా(2).

                                       కైలాసగిరి నుండి కాశికై

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి కుర్ కురే-3(కొంచెం వాస్తవికత! కొంచెం అతిశయోక్తి!)

   animatedprofessor                  ఒఖ్ఖ మగాడు!
స్త్రీ వాదం, సామ్యవాదం, సమానవాదం…
“చలం అచలం” అంటూ ఎవరి పేరో పట్టుకుని,
వాదాల పేరిట వివాదాలెత్తి
చేస్తున్నదేమిటయ్యా? ఈ హిపోక్రిటికల్ సింగినాదం!
ఆమె ఏ పేరెట్టుకోవాలో,
ఆమె ఏం తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏం ఆలోచించాలో,ఎటు చూడాలో,…
అన్నీ, ఇక అన్నీ… అతడే వక్కాణించును.
ఎదురయ్యాడా మీకు ఎక్కడైనా ఈ ఒఖ్ఖ మగాడు?

యే జో భి హై యే హమారే వాస్తే కుచ్ బోలేగా నా బెహన్ జీ!
తభీతో ఇన్ కో ఏక్ కప్ కాఫీ తో జరూర్ దేతీ హై మీనాక్షి!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కుర్ కురే-2(కొంచెం వాస్తవికత!కొంచెం అతిశయోక్తి!)

                    

                               ఒఖ్ఖ మగాడు!

స్త్రీ పేరెత్తితేనే వల్లించునితడు
“ఛ గుణింతము”–ఛ,ఛా! ఛి, ఛీ…
అయితే
సూర్యుని చుట్టూ తిరుగు గ్రహాల్లా
ఈతని కూతలు, కోతలు, రాతలు,రోతలూ,బూతులు…
పరిభ్రమించును “స్త్రీ జగత్” చుట్టూ
అగుపించినాడా మీకూ ఈ ఓఖ్ఖ మగాడు?

అంతగ  నువ్వు బాధ పడకు, మీనాక్షి!
ఏదో ఓ ఇంటికి ఇతడూ దశమ గ్రహమే!

ఏ భారత్ భారతీ హై జీ!
ఏ జోభి హై ఇన్ కా పీచే భి హై ఏక్ బెహన్ జీ!
ఏ హుయి నా బాత్! మీనాక్షి!

6 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కుర్కురే!(కొంచెం వాస్తవికత! కొంచెం అతిశయోక్తి!)

రుచించుతుందేమో చూడండి!

                                ఒఖ్ఖ మగాడు!
భార్య ప్రక్కనుంటే బహుజన ఆదరనీయుడూ, పెద్ద మనిషి!
ఏ.. ఏ.. ఏ?
ఎందుకంటే కట్టేది పట్టు పీతాంబరాలు,వుత్తరీయమూనూ!
పెళ్ళాం ఊరెడితే, పోకిరి రాజా!
ఏ.. ఏ.. ఏ?
ఎందుకంటే పూల చొక్కా, జీను ప్యాంటూనూ!
మీకూ ఎదురయ్యడా, ఇతగాడు?
ఇతడే ఇతడే ఒఖ్ఖ మగాడు!
హ హ హ ! యే జోభి హై, ఇన్ కా సాత్ దేనా హై, బెహన్ జీ!
ఆగే క్యా హోగా? మీనాక్షీ!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కూనిరాగాలు-14

  మీనాక్షికి నచ్చిన మరో పాట.మీకూ నచ్చుతుందేమో చూడండి.
“గుండెలో గూడెట్టి గువ్వలా దాచానే
గూడొదిలి పోబోకే గుండె పిండౌతాది

                                గుండెలో…

నిన్న మాపటి యేళ నీ పాట ఇన్నానే
సూటిగా ఏటేటో మాటాడ దలిచానే
నీ ఎదుట నిలబడితే, మాట రాదేటో
నా లోటు నీకేటో ఆటలా వుంటాది.(2)

                                గుండెలో…

నువ్వు నవ్విన చోట సిరిమల్లె రాలిందే
మల్లె రాలిన చోట కళ్ళద్దుకున్నానే
నవ్వాపబోకే ముళ్ళులా వుంటాది
నీ కళ్ళ నీళ్ళొస్తే గుండె పిండౌతాది

                                గుండెలో…

“నీ కళ్ళ నీళ్ళొస్తే, గుండెపిండౌతాది…” ఇలా అనేసిన తరువాత ఇంకే మాట్లాడుతుంది ఆమె! గూడు ఎందుకు వదులుతుంది?

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized

మీనాక్షి కూని రాగాలు-13

“తోడు నువ్వు లేని ఈ క్షణం” ( ఐ యాం హరీష్ బ్లాగ్)అన్న కవిత చదివేక, ఎప్పుడో విన్న ఈ పాట గుర్తొచ్చింది.ఆరుద్రగారు రచయిత.మన ఘంఠసాలగారి “కుంతి కుమారి” క్యాసెట్లో దొరుకుతుంది మీకు ఈ పాట. “బహు దూరపు బాటసారి”,”రావోయి బంగారి మావ”,”తలనిండ పూదండా…” ఇలా ఒకటేమిటి… ఆ క్యాసెట్లో ఉన్నవన్నీ ప్రాచుర్యం పొందిన పాటలే!

“నీ చేయి నా చేయిపై నేసి
నీ చూపు నా చూపు సైజేసి
నిను బాసి మనలేననే బాసనూ
నీ పెదవి నా పెదవి పై జేసెను.

ఉన్నాదీ ఆశపై కొన ఊపిరి
కన్నీరు కాదిదే గోదావరీ
నన్నేల విడనాడి పోతావని
అన్నావు బరువుగా ప్రాణేశ్వరీ!

                                  నీ చేయి…

నా మేను నీ మ్రోల పడవేసి
నా బ్రతుకు నీ బ్రతుకు ముడివేసి
నిను బాసి మనలేననే  బాసనూ
నా యెడద నీ యెడదలో నాటును

                                    నీ చేయి…”
ఈ పాట అందరికీ అంతగా గుర్తుండక పోయినా,ఓ సారి వింటే మరచిపోయే లాంటి పాట కాదనిపిస్తోంది కదూ!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized