Monthly Archives: మార్చి 2009

మీనాక్షి గూటి గువ్వ పెద్దదయిందోచ్!


మా ఇంట పుట్టిన ఈ గువ్వ బుడి బుడి నడకలు నడచి నప్పుడు అనుకున్నాను, ఇంక రెండు రోజుల్లో ఈవిడ ఎగిరిపోతుందని! అయితే ఊహించిన దాని కన్న ఎక్కువ హుషారూ, ఈవిడకి! అందుకే అడుగేసిన మర్నాడే అమ్మగారి పర్యవేక్షణలో ఎగిరి చూపించింది.అప్పటివీ ఈ ఫొటోలు!గమనించండి వారినీ, వారి అమ్మగారినీ మా ప్రక్కనున్న బిల్డింగ్ సన్ షేడ్ ! ఇక్కడ మరొక కొస మెరుపు– ఈవిడ ఎక్కడెక్కడ తిరిగినా రాత్రివేళ  మా పూలతొట్టి నీడనే విశ్రమిస్తొంది ఇప్పటివరకూ.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కుర్ కురే! అప్పుటచ్చులు హ హా! హి హీ!

అనగనగా ఓ అమ్మాయి! అంతగా తెలుగు వ్రాయటం రాదు! అందు చేత అప్పుటచ్చులు సహజమే!
తరగతిలో తెలుగు విగ్రహ వాక్యాలూ వగైరాలు అధ్యాపిక వేగంగా చెప్పుకుంటూ పోతున్నారు. అమ్మాయిలందరూ హడావుడిగా పుస్తకంలో ఎక్కించేస్తున్నారు. ఇదిగో ఇలా–“….అన్న భావ ముద్దిష్ఠము.” అధ్యాపిక పూర్తి చేసారు.
 మన అమ్మాయి పుస్తకంలో “…అన్నా! బావ ముద్దిష్టము”. 
హ హా! హి హీ! మనకి పర్వాలేదు. ఈ వ్రాతని ఆ పదహారెళ్ళ పిల్ల అన్నగారు చూస్తే,అప్పుడు
“చెంపకి చేయి పరంబగునపుడు, కంటికి నీరు అదేశంబగున్…” అంతేనంటారా?
 అబ్బో! నేటి మన తెలుగు సినిమా హెరోయిన్లు ఇటువంటి తప్పులు టప్ టప్పున డైలాగుల్లో  చేసేస్తుంటారేం! ఎంచక్కా మనం నవ్వుకోడానికి వీలుగా!

5 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి గూటి గువ్వ పెద్దదైయిందోచ్!

 

బుడి బుడి నడకలతో పూలతొట్టి గడప దాటింది నా ఈ ఎమిలీ! మీకు పంచమంటారా గారెలు?

2 వ్యాఖ్యలు

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షీ కూనిరాగాలు-20

                               ఉగాది వచ్చేసింది! ఏవిటో కోకిలమ్మ కూతలింకా నా చెవినయితే పడలేదు.ఒకటీ, అర మా మిడి చెట్లు పిందెలతో కనిపించాయిలెండి! మల్లియలు ఎలా పూస్తున్నాయో తెలీదుగాని మూర పదీ,పన్నెండూ అంటున్నారులెండి! ఏది ఏమైనా,అన్నీ చేదు నిజాలే అయినా–మీ కోసమే ఈ తీపి పాట–

“మామిడి కొమ్మా, మల్లియ రెమ్మా,మంతనమాడెనదే!
కోయిల కొమ్మ, రాచిలకమ్మ పాటలు పాడెనదే!

మన్మధ రాజు మాధవు గూడి మహికేతెంచె నహో!
సకల చరాచర జాలము వారికి స్వాగతమిచ్చే నహో!

                  మామిడి కొమ్మా, మల్లియ రెమ్మా

యువతీయువజన సహృదయమ్ముల పరిమళరాగమిదే
నవ రసాలముల నవ కిసాలముల వసంత యాగమిదే!
నవ వసంత యాగమిదే! శుభ వసంత యాగమిదే!
 
                 మామిడి కొమ్మా, మల్లియ రెమ్మా

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి లేఖలు-7

ప్రియమైన కృష్ణ యామినీ!
   చాలా రోజులైపోయింది మనం కలుసుకుని. ఏమిటో! యాంత్రిక జీవితంలో తీరిక దొరికినా తిన్ననైన పని ఒక్కటి కూడా చేయట్లేదు నేను.ఈ మధ్యనే తప్పించుకోలేక బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే రాజ్య లక్ష్మి పిన్ని కల్సింది. నీకు గుర్తుంది కదూ! నువ్ క్లియోపాత్రా అని నిక్ నేం పెట్టినావిడే. ముసలితనం మేలి ముసుగు అందరికి అంత నప్పకపోయినా, ఆవిడకి మాత్రం అది మరింత శోభ  ఇచ్చింద నే చెప్పాలి.నన్ను చూడగానే ఆప్యాయంగా కౌగలించుకుని కుశల ప్రశ్నలు వేసింది.
    “నువ్వెలా వున్నావు పిన్నీ! బాబయ్య ఎలా వున్నారు?” నా ప్రశ్నల పరంపర మొదలైయింది అంతే…పిన్ని కళ్ళలో నీళ్ళు. నేను ఖంగారుపడి “పిన్నీ! ప్రక్కకి వెడదాం రా!” అని తీసుకెళ్ళి వివరాలు చెప్పమన్నాను.విషయం విన్న నాకు తల తిరిగి పోయింది. బాబయ్యకు ముసలితనంవల్ల బ్రైన్ కి
బ్లడ్ సర్కులేషన్ సరిగా లేనందు వల్ల వర్తమానం అసలు గుర్తు వుండట్లేదని. కేవలం ఆయన సబ్ కాన్షస్లో నిల్వవున్న వాటి గురించే మాట్లాడుతున్నారనీ చెప్పింది.
“పోనీలే! దాని వల్ల నష్ఠం ఏమిటి? మాటలు వచ్చీ రాని చంటి పిల్లాణ్ణి భరించినట్లు భరించు పిన్నీ”,అన్నాను.
కారుతున్న కన్నీటికి ఆనకట్ట వేసే ప్రయత్నం కూడా చేయకుండా, వెక్కుతూనే”అది కాదే! నీకు నా పెళ్ళైన కొత్తలో మీ బాబయ్య  తెలుసు కదా! చాల విశాల హృదయం కలవారిగా మన చుట్టాలందరిలోనూ పేరు తెచ్చుకున్నారు. నేను ఎప్పుడైనా ఏ పని కైనా బయటికి వెళ్ళడానికి జంకితే కోప్పడేవారు.’ మిలిటరివాడి భార్యవి పార్టీలకి రావడానికి వెనుకడుగేస్తావా?’– అంటూ గద్దించి మరీ అక్కడకీ, ఇక్కడికీ, వెంటవేసుకు వెళ్ళేవారు.నేను కూడా ఆయన్ని చూసి గర్వపడని క్షణం లేదు. ఆయన ఏ కాంపుల కెళ్ళినా నిర్భయంగా ఇద్దరి పిల్లలని పెట్టుకుని ఆ ఎడారిల్లోనూ, అడవుల్లోనూ వుండేదాన్ని.వయసు లో వున్నప్పుడు మా ఇద్దరి మధ్యన ఏ పొరపొచ్చలూ వుండేవి కావు.అలాంటిది…”వెక్కిళ్ళు ఆగలేదావిడకి.గుక్క తిప్పుకోలేక పోయింది.గబ గబా వీపు రాసి, కాస్త సర్దుకున్నాక మంచి నీళ్ళ గ్లాసందించాను.కొంచెం కుదుటపడి మళ్ళీ చెప్పడం మొదలు … “ఇప్పుడు ఈ వయసులో నన్ననుమానిస్తున్నారు. గోడ దగ్గర నేనుంటే,అక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావంటారు.కొడుకులూ, కోడళ్ళు అందరూ వుండగా నన్నీ విధంగా బాధపేడుతున్నారు.ఇంకా పైగా ‘ఆడవాళ్ళకు ఎప్పుడే బుద్ధి పుడుతుందో చెప్పలేం…స్త్రీ బుద్ధి  ప్రళయాంతకమంటూ, ఏం చెప్పగలం నేనిలా వున్నాను గనుక ఈవిడ ఎవరితోనైనా…ఇంక నేను చెప్పలేనే! కోడళ్ళు అంతో ఇంతో సంస్కారం  వున్న వాళ్ళు గనుక నేను ఈ మాత్రం నిలబడ గలుగుతున్నాను.అదే వాళ్ళు ‘ఈవిడ చిన్నతనంలో ఏం చేసిందో ఆయనకు అదే మనసులో వుండిపోయింది అనుకుని వుంటే…ఒక్కసారి ఆలోచించు నా గతి ఏమైవుండేదో!’
 విసుగొచ్చి పెద్దవాడు డాక్టర్ని అడిగాడు.దానికి ఆయన ‘ చిన్నప్పుడు సోషల్ బిహేవియర్ పేరిట ,సంస్కారం పేరిట ఆయన అణచిపెట్టేసినవన్నీ ఇప్పుడు బయట పెట్టేస్తున్నాడన్న మాట. He must have been a very possessive man

 and at the same time  he strained himself a lot to stand as aa

sophisticated person. There lies the problem.ఇప్పుడిక మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఏ కౌన్సిలింగ్ లాంటిదైనా చిన్నతనంలో పని చేస్తాయి. మీరు మరీ భరించలేనప్పుడు ట్రాంక్విలైజెర్ డోస్ పెంచివేద్దాం’ అన్నాడు.
“నేనెంత పిచ్చిదాన్నే! ఆయనకి అటువంటి అభిప్రాయాలు నా పట్ల వున్నాయని ఈ రోజువరకు తెలుసుకోలేక పోయాను. అప్పటికి అది మంచి గానే జరిగిందనుకున్నా, ఇప్పుడు చచ్చే కాలానికి నేనెక్కడ నిల్చున్నాను అని అలోచిస్తే, చచ్చిపోవాలనిపిస్తోంది.ఇంతకాలం నేను మిధ్యలో బ్రతికేనన్న మాట. ఎంత గర్వగా పొగిడేదాన్ని ఆయనని గురించి. పెద్దవాడు ఇదంతా భరించలేక, ‘అమ్మా! నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్ళి వుండు. నా భార్య ఈయనని చూస్తుందిలే, అంటున్నాడు.కాని నా కోడలు కూడా చిన్న పిల్లే! ఇన్నేళ్ళు ఆయనతో బ్రతికినదాన్ని నాకే కష్టంగా వుంటే, ఆ అమ్మాయి మాత్రం ఎలా భరించగలదు?– పిన్ని ఏడుస్తూనే వుంది.
    అప్పుడనుకున్నాను మొగుడిని అనుమానించి అప్పటికప్పుదు తేల్చుకోవాలనే ఆడవాళ్ళే మేలు,ఇలా లోలోపలే కుళ్ళిపోయే మగవాళ్ళ కంటే. అసలు మగవారైనా, ఆడవారైనా అలా భావావేశాలని అణచిపెట్టి,అణపెట్టీ నడచుకుంటేనే,వివేకం పూర్తిగా నశించిపోతుంది. దాని కన్న ఏదో ఒక ఔట్లెట్ చూసుకుని వెళ్ళగ్రక్కితే, వారి ఆరోగ్యానికీ,వారి వెంట నడిచేవారి ఆరోగ్యానికీ మేలు జరుగవచ్చు. కాదంటావా?
  ఏది ఏమైనా పిన్నికి స్వాంతన ఈయడం కోసం నేను “అప్పుడప్పుడు వస్తుంటానులే, నీకూ కొంత రిలీఫ్ గా వుంటుంది” అని వాగ్దానం చేసాను. అయితే నెరవేర్చగలనో లేదో కాలమే చెప్పాలి. 
        బుర్ర వేడెక్కించేసానే! ఓ కప్పు కాఫీ త్రాగు. నేను అందుకే వెడుతున్నాను.
                        ఇట్లు,
                       మీనాక్షి.

7 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి లేఖలు

మీనాక్షి గూటి గువ్వలు

image564

సందె పొద్దుల
సజ్జ విందులు
సక్కంగ ఆరగించి
మీనాక్షికివి అందించు సత్సంఘము.

జనులేమందురో, జగమేమౌతున్నదో అన్న చింత అందుకే మీనాక్షికి అసలు వుండట్లేదేమో!

అన్నట్లూ, ఆ కనిపించే చింత చెట్టు గురించే నేను నా “వేవార్డ్ ప్రణయాలూ-గ్రే బర్డ్ వీక్షణలు”–అన్న కవితలో వర్ణించాను.

6 వ్యాఖ్యలు

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కూనిరాగాలు-19

ఈ పాట సీ.నారాయణ రెడ్డిగారిదండీ.ఇది కూడా చక్కటి చిక్కటి సాహితీ సౌరభం కలిగి వున్నదే!ఓ సారి చూడండి!

“సాగుమా ఓ నీలి మేఘమా,
గగన వీణా మృదుల రావమా!

బీటవారిన చేల పీయూషములు వ్రాల
గరిక లేని పొలాన ,మరకతమ్ములె తేల
             సాగుమా ఓ నీలి మేఘమా…

నెమలి పాదాల కింకిణులు ఘల్లని మ్రోగ
ప్రియురాలి వలపు, మల్లియలు ఝల్లని పూయ
              సాగుమా ఓ నీలి మేఘమా…

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు