జయకాంతన్ కథలు-2(అగ్ని ప్రవేశం)

     ఈ కథలో, ఒక మధ్య తరగతి సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతి,ఓ వర్షపు సాయంత్రం, కళాశాల నుండీ తిరిగి వస్తూ,తప్పని పరిస్థితిలో ఒక కారు ఎక్కుతుంది. ఆడపిల్లలతో అలవాటుగా ఆటాడుకునే అతను, ఇదే అదనుగా తీసుకుని ఆమె శీలాన్ని హరిస్తాడు. ఇక్కడివరకూ ఇది పాత సమస్యే! అనకూడదుగానీ ఇది నిరంతర సమస్య! అయితే దీనికి జయకాంతన్ చూపిన క్రొత్త పూరణం నాకు నచ్చింది. సాహిత్యం నాగరికతకు ఒరపిడి రాయిలా ఎలా నిలువగలదో ఈ ముగింపే ఉదహరిస్తుంది! మళ్ళీ రేపు ఈ రేపు సీను ముగింపేమిటో మాట్లాడుకుందాము.

         ఇక కథలోకి వెళ్ళి, అటు పైన ముగింపు సంగతి మాట్లాడుతాను.
  ముందుగా ఆ అమ్మాయి కారెక్కినది మొదలు ఆమె మనోభావాలు రచయిత మాటల్లోనే చూడండి-
“మరైతే ఇప్పుడు నేను చేస్తున్న పనేమిటి? ఇలా ఒక ముక్కూ మొగమూ తెలియని ఓ కొత్త వ్యక్తి వెంట, అతని కారులో తిరగడం తప్పు కదూ? వాలకాన్ని బట్టి చూస్తే ఈ మనిషి మరేమంత దురాగతాలు చేసేవాడిలా కనిపించడంలేదు.సరే! కానీ నే నిలా రావడం మట్టుకు తప్పే, మరైతే ఇప్పుడేం చేయాలి? ఏమైనా చేసే మాట దేవుడెరుగు! ముందుగా ఏడుపే వస్తోంది.చీ! ఏడవచ్చా? ఏడిస్తే ఈయనకి కోపం రాదూ? వెకిలి పిల్లా!ఇక్కడే అఘోరించు,అని అర్థాంతరముగా రోడ్డుపైన దింపి తన పాటికి తాను వెళ్ళిపోతే? మళ్ళీ నేనేలా ఇల్లు చేరేటట్లూ? …”

మౌనంగా వున్న ఆ అమ్మాయి మనసులో పై విధమైన ఆందోళన ఒక ప్రక్కనుండగా, ఒక మధ్య తరగతి అమ్మాయికి సహజముగా కారులాంటి ఖరీదైన వస్తువులపట్ల వుండే ఆకర్షణ ఒక ప్రక్కనా ముప్పిరిగొని ఆ అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వుంటాయి.
   ఇటువంటి సన్నివేశం అతనికి అలవాటైనదే గనుక, అతను అదను చూసి,”రెండేళ్ళుగా నీకోసమే ఎదురు చూస్తున్నానంటూ ఇచ్చకాల మాటలు చెప్పి చూయింగ్ గం అందించే నెపముతో ఆమెకు శారీరకముగా దగ్గిరయ్యే ప్రయత్నం చేస్తాడూ, సఫలీకృతుడౌతాడు కూడా! ఎందుకంటే వయసు తాలూకు ఆకర్షణలకు-అంటే కారూ, అందగాడైన యువకుడూ, అతని ప్రేమని ప్రకటిస్తూ అతగాడు చెప్పిన మాయ మాటలూ–అన్నీ ఆ అమ్మాయి మీద మత్తు మందులా పని చేస్తాయి.రచయిత వీటన్నిటికి సింబల్ గా చూయింగ్ గం ని ప్రస్తావిస్తారు. (ఆ రోజుల్లో చూయింగ్ గం మధ్య తరగతి ఆడపిల్లలు నమలడం…అరుదుగా జరిగేదని మనకందరికి తెలిసిన విషయమే!)

   అందువల్ల ఆమె ముందు పెట్టిన కేకలు, తరువాత వేడుకోలుగా మారతాయి…తరువాత అది కూడ మాయమౌతుంది.
 జరుగవలసిన దుష్కార్యము జరిగి పోయాక అతను డ్రైవర్ సీట్ లో కూర్చుంటూ, బురదలో ఖరాబైన పాదరక్షల్ని ఓ మూలకి విసిరుతాడు.రేడియో, దానితో బాటు సిగరెట్, మళ్ళీ చూయింగ్ గం …అన్నీ అతనికి మామూలే.  T.S.Eliot  “when a lovely girl stoops to folly, she switches on the gramophone,and combs her hair with an automatic hand” (The  Waste Land)., వెంఠనే స్ఫురణకి వచ్చింది కదూ! కారు, రేడియో పాట, చూయింగ్ గం అన్నీ యాంత్రిక జీవనానికి సింబల్స్. కాకపోతే ఇలియట్ అక్కడ అమ్మాయి జీవితాన్ని వర్ణిస్తే, జయకాంతన్ యువకుడిని వర్ణిస్తారు. అంతే మరీ! అది పాశ్చ్యత దేశం, మనది భారతం. అప్పటికి మన అమ్మాయిలు ఇంకా అంత ముదరలేదు .
అంతా జరిగాక అతనిని ఇంటికి దింపమని వేడుకొని ఇంటికి వస్తుంది, వచ్చి తల్లికి వెక్కుతూ అంతా వివరిస్తుంది.ముందు అరచి తిట్టబోయిన తల్లి ప్రక్కింటావిడ వచ్చి “ఏమి జరిగింది…” అని అడగ్గానే స్పృహలోకి వచ్చి సంభాళించుకుని, కేవలం వర్షంలో తడసి వచ్చి నందుకు తిడుతున్నాని అంటుంది. ఒక క్షణం ఆలోచించి ఆమెకి తలార స్నానం చేయించి పునీతురాలిని చేస్తుంది. నాటి సీత అగ్ని ప్రవేశం నేటి ఈ యువతి జలంతో పునీతురాలైంది. అగ్ని, నీరూ రెండూ కూడా పంచ భూతాలలోనివే. దేనినైనా పవిత్రం చేయగల సామర్థ్యము కలిగినవే!
  కొసమెరుపు  ఏమిటంటే అతనందించిన ఆకర్షణ! అదే! చూయింగ్ గం! అప్పటివరకూ ఆమె నోట్లో నానుతూనే వుంటుంది! తల్లి గుర్తు చేసి దానిని కూడా ఉమ్మేసి రమ్మంటుంది. అటు తరువాత ఆ అమ్మాయి ఎన్నో సార్లు అవసరాలొచ్చినా, కార్లూ ఎదురొచ్చినా  ఎక్కలేదంటూ రచయిత కథని ముగిస్తారు.
   నన్ను మీరేమన్నా అనుకోండి. ఈ కథని నేటి యువతులందరూ ఒక్క సారన్నా చదవాలి అంటాను నేను. ఎందు చేతనంటే సమాజం మనకి అనేక ఆకర్షణలని అందుబాటులో వుంచుతుంది. అందుకు తగ్గట్లు జీవితం కూడా పరీక్షగా వాటికి మనం చేరువైయ్యే అవకాశాలూ కలిపిస్తుంది. అయితే ఏది ప్రమాదకరమైనదో, ఏది మనకనువైనదో తేల్చుకోవలసినది మనమే! ఇకపోతే మన ప్రమేయం లేకుండా కొన్ని ప్రమాదాలు   ఎదురు కావచ్చు. మరి అప్పుడో! ఏవుందీ ఆ పిల్ల తల్లిని చూసారుగా! మన మనసులో మాలిన్యం లేనప్పుడు తెలివిగా అల్లరి పడకుండా ఒడిదుడుకుల్లో పడిన జీవితాన్ని ఒడ్డున జేర్చేయాలి.
   ఇప్పుడు నిర్ణ యించుకోండి! జయకాంతన్ గారి ఈ కథ సమాజన్ని చక్కగ చేసే ఒరపిడి రాయివంటి సాహిత్యానికి ప్రతీక కాదంటారా?

    అయితే ఒకటి రచయిత విచ్చల విడితన్నాన్ని ఎంత మాత్రమూ ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే కన్నీరు మున్నీరుగా ఏడు స్తున్న ఆ అమ్మాయిని చూసి, “తప్పు చేసాననుకుంటూ…ఐ ఆం సారీ!” అని పశ్చ్యాత్తాప పడతాడు.అతిగా ఇవ్వబడిన స్వేచ్చ తననీ స్థితికి దిగజార్చిందని రెండు చుక్కల కన్నీరుని అతడు తన కంటి చివర నిల్పి, తరువాత వాటిని తుడిచేస్తాడు. క్షమాపణ కోరిన తనని ఆమె చూసిన చూపుకి తల్లడిల్లి పోతాడు! అయితే అది క్షణ కాలమే కావచ్చు!తను తప్పు చేసేనని   అతను గ్రహించాడు కదా! అదే పాఠకులు గుర్తించాల్సిందీ! గుర్తుంచుకోవలసినదీనూ!

  Basic instincts కి లోబడి పోయిన అతనిలో ఈమె పశ్చ్యాతాప పడడం అనే   finer human sentiment  ని డెవెలప్ చేస్తుంది.

   న న్నడిగితే ఇటువంటి సమస్యలెదురైనప్పుడు వీధుల వెంబడి అరచి ఆ అమ్మాయిని అల్లరి పాలు చేసే కంటే, ఈ విధంగా పరిష్కరించడమే మేలూ!
 ఒక్కసారి ఆలోచించండి తనేదో ఘనకార్యం చేసేననో, లేదా తన మగతనాన్ని నిరూపించుకున్నాననో విర్రవీగేవాడికి, ఇదేమీ లెక్కచేయక కుండా,అసలు మరచిపోయినట్లు ఆ అమ్మాయి మర్నాడు అదే బస్టాపులో ఎదురైయిందనుకోడి…అది అతని మొహమ్మీద చాచి పెట్టి కొట్టినట్లే కదా! ఇక్కడ ఆ అమ్మాయి అతను క్షమాపణ చెప్పినప్పుడు ఓ అర్థవంతమైన చూపు చూసి అదే భావాన్ని వ్యక్తం చేసిందని మనం అర్థం చేసుకోవాలి. అన్నట్లు ఈ కథని సినిమా కూడా తీసేరని విన్నాను! నేనైతే చూడలేదనుకోండీ! మొత్తానికి ఇది సంచలనాత్మకమైన కథే! కాదంటారా?

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి సాహిత్య వీక్షణలు

3 responses to “జయకాంతన్ కథలు-2(అగ్ని ప్రవేశం)

  1. vemparala sarada

    Sri gaaru, Agni Snaanam anukuntaa aa katha peru. marapu raani aa kathani marosaari cheppinanduku chala chala thanks.

    `vasundhara’

  2. సినిమా తీసింది ఈ కథ కాదు అది నవల. ఈ కథలో అమ్మాయి తల్లిలాంటిది కాని ఓ మాలోకం తల్లి వల్ల అల్లరై పెళ్లీపెటాకులకు దూరమైన అమ్మాయి. ఓ ఐదేళ్లు గడిచి చదివి ఉద్యోగం చేస్తుండగా ఆ అబ్బాయి, మధ్యవయస్కుడై పరిచయమై అతని జీవితాన్ని తెలిసి కూడా ఇష్టపడితే ఏమౌతుందనేది కథ. విచిత్రమేంటంటే ఆ నవల్లో కూడా ఈ అగ్నిప్రవేశం కథ పత్రికలో పడుతుంది. రాసినాయన దగ్గరకి వెళ్లి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. నవల అదిరిపోతుందనుకోండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s