Monthly Archives: మే 2009

మీనాక్షి కుర్కురే! అప్పుటచ్చులు!హ హా! హీ హీ!

SuperStock_1538R-55402   అనగనగా ఓ అమ్మాయి! తెలుగు అంతగా రాని అమ్మాయే! అమ్మ వంట చేసుకుంటూ, రేడియో లో చెబుతున్న వంటకాన్ని వింటూ వ్రాసిపెట్టమంటే,గబ గబా వ్రాయడం మొదలెట్టింది. ఇదిగో ఇలా–

సొరకయ మసల

ముందుగ నునెలొ పొపు వెసి,సొరకాయ ముక్కులువెసి మూతి పెట్టాలి.నెకస్ట్ నానపెటిన పాచి సెనగపపు, ఎండు మిరపకాయ, జీలకర,రూబ్బి
సొరకాయ ముక్కలలొ వేయాలి.చివరలో డప్పెయ్యాలి:)డల్లిపాయ తినేవరు కలుపుకోవచు.
అసలు వంటకం  ఇది:
సొరకాయ మసాలా:
ముందుగా నూనెలో పోపు వేసి, సొరకాయ ముక్కలవేసి, మూత పెట్టాలి.నెక్స్ట్ నానపెట్టిన పచ్చి శనగపప్పు, ఎండు మిరపకాయ, జీలకర్ర, రుబ్బి సొరకాయ ముక్కలలో వేయాలి. చివరలో ఉప్పు వేయాలి. ఉల్లిపాయ తినేవారు కలుపుకోవచ్చును.

  వంటకం మాటేమో గానీ! వంట సరిగ్గా కుదరనప్పుడు డప్పేసి మరీ (అంటే పొగడి పొగడీ…అన్న మాట!) ఇంట్లోవాళ్ళ చేత తినిపించాలి అన్న కిటుకును చిన్నప్పుడే పట్టేసింది మన అమ్మాయి! అంతేనంటారా?

ప్రకటనలు

7 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కూనిరాగాలు–29

  

     నాకు నచ్చిన మరో పాట. పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరచినది. మృత్యువు ఇతివృత్తంగా గలదే!

ఈ లోకంలో ఈ నా దేశంలో,
ఈ నా ఇప్పటి దేహంలో,
ఎన్నాళ్ళైనా బ్రతకటమిష్టం.
ఎపుడు రాలినా ఇష్టం.
నే రాలిపోయినా ఇష్టం.

సంసారం సాగరమైతే
జలక్రీడగా జీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం అంటే
మరణం అంటే మరి మరి ఇష్టం.

                   ఈ లోకంలో ఈ నా దేశంలో,…

పొరపాటుగా మోక్షం వస్తే,
మళ్ళీ పుట్టుక లేకుండా పోతే,
ఇలాతలానికి దూరంగా,
ఎలాగన్నదే నాకు భయం.

                   ఈ లోకంలో ఈ నా దేశంలో,…

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమిబాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శృతిలో కలసిన పాటగా నే పాడగా

                   ఈ లోకంలో ఈ నా దేశంలో,…
అన్నట్లు ఈ పాట ని నాకు వినిపించినవారు మీకూ పరిచయస్తులే! http//:srikaaram.wordpress.com/వారు. వారికి నా కృతఙ్ఞతలు.

5 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు -28

“మృత్యువు”–ఈ ఇతివృత్తం మీద ఒక పాట ఇచ్చాను గనుక అదే ఇతివృత్తం మీద నాకు నచ్చిన మరో పాట. ఇది పాట కాదు తత్వం అని కొందరంటారు.  పేరేదైతేనేం లెండి. ఇది బాలమురళి గారి గొంతు నుండి వెలువడి విన్నప్పుడల్లా నాకు దూరమైన నా ఆత్మీయులనెందరినో గుర్తు చేసి ఓ క్షణం కంట తడి తెప్పిస్తుంది.మీరూ ఓ సారి చూడండి!

గూడు చినబోయెరా, చిన్నన్నా!
గూడు చినబోయెరా, చిన్నన్నా!
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా…

                గూడు చినబోయెరా, చిన్నన్నా!
ఎక్కలేని పర్వతాలు వేయినూళ్ళ నిచ్చెనేసి,
ఎక్కడ చూసిన గానీ చిలుక జాడే కానరాదు.

                గూడు చినబోయెరా, చిన్నన్నా!

పంచపరమాన్నమూలు పళ్ళెమూలో పోసి వుంచి,
లాలించి పిలచిన మాటలాడదు రామచిలుకా…

               గూడు చినబోయెరా, చిన్నన్నా!

కొండ మీద బండి వాలెను, గుండె రెండు చెక్కలాయెను,
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా…

              గూడు చినబోయెరా, చిన్నన్నా!

3 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు-27

  ‘చల్తే చల్తే,యూహి కోయి మిల్ గయా థా…’,పాట వింటూవుంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఘంటసాలవారిదీ! పైగా బాగా ప్రాచుర్యం పొందినదీనూ!  

బహుదూరపు బాటసారీ, ఇటురావో ఒక్కసారీ(2)

అర్థరాత్రి పయనమేలనోయి, పెనుతుఫాను రేగనున్నదోయి
నా కుటీరమిదేనోయి,విశ్రమింప రావోయ్

                       బహుదూరపు బాటసారి…

పయనమెచటికోయి, నీ పయనమెచటికోయి
నీ దేశమేదటోయి, నా ఆశలు తీరెనోయి
నీతో కొనిపోవోయ్ , వేకువనే పోదమోయ్

                      బహుదూరపు బాటసారీ…

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి ఇంటిలో మళ్ళీ పురిటి సంబరాలు

        Image(646)Image(647)Image(648)       

    Image(649)     Image(652)Image(653) 

నెల క్రితమే పుట్టిన మీనాక్షి గూటి గువ్వకి మీనాక్షి ఎమిలీ అని పెరు పెట్టిన విషయం మీకూ తెలుసుగా! కనీ అది మగ పావురమండీ!నెల తిరిగిందో లేదో వెరే పావురాఇ తో జత కట్టడం, ఆవిడగారు మళ్ళీ ఈవిడ పుట్టిన కుండీ (దానిని తీసేసాను! అయినా సరే…)ప్రక్కన బకెట్లో నిర్భీతిగా రెండు గుడ్లు పెట్టడం, మొన్న ప్రొద్దున్నే మా ఇంటిలో లవ కుశులు పుట్టడం జరిగాయి.ఒక విశేషం  చెప్పనా! ఈసారి గ్రుడ్డులోంచి బయటకి వస్తూవుండగా మీనాక్షి చూసేసింది! ఫొటోలూ తీసింది. వాటిని మీరూ ఓ సారి వీక్షించండి!

     ప్రక్క బిల్డింగ్ సన్ షేడ్ మీద నా ఎమిలీ ప్రసవ వేదన పడుతున్న తన భార్యకి తోడుగా కూర్చుని చూస్తోంది గమనించండి! ప్రకృతికి మించిన గురువెవరన్న వుంటారా అండీ! పశు పక్ష్యాదుల నుండీ మనం నేర్చుకోవలసినది ఎంతైనా వుంది!

1 వ్యాఖ్య

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

నేనూ- నా తరువాత తరం (1)

 tn

      మొన్న అన్నమయ్య లక్ష గళ సంకీర్తనకి వెళ్ళాము. నేనూ శ్రీవారూను! నిల్చుని వింటుండగా ఓ పాతికేళ్ళ వయసున్న అమ్మాయి నన్ను గుర్తు పట్టి నా దగ్గరకి వచ్చింది. “అత్తా! లక్ష మంది కలసి పాడుతూ వుంటే ఎంత వైబ్రేషన్ వుంటుందో, నేనూ గొంతు కలుపుదామని వచ్చాను. కాని ఇక్కడ ఆయన గొంతు మాత్రమే వినపడుతోంది…అలా మనం సీ.డీ లో కూడా వినవచ్చును కదా…” అంది.
  ఆ పిల్ల హై-టెక్ సిటిలో హాస్టల్ లో వుండి జాబ్ చేస్తోంది! అక్కడి నుండి పెరేడ్ గ్రౌండ్స్ వరకూ వచ్చింది. నేను నా చుట్టూ అప్పుడు చూసాను.నా చుట్టూ వున్నది చాలా వరకు యువతే!అన్నట్టు నేను పాడడానికి వెళ్ళలేదండీ. కేవలం విందామని వెళ్ళాను. మేము స్టేజ్ కి చాలా దూరం గా వున్నాము. అయితే నేను గమనించినదేమిటంటే నా చుట్టూ వున్న అంతమందీ– ముఖ్యంగా యువత అందరూ పాడుతున్నారు.
   నాకెంత సంతోషం వేసిందో చెప్పలేను.నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇటువంటి కీర్తనలు గుళ్ళలోనూ గోపురాలలోనూ కేవలం సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాడేవారు. కాని ఈ రోజున అలా లేదు. వినడానికి వచ్చినవారు కూడా పాడుతున్నారంటే ఎంతో కొంత ఆ పాటల పట్ల అభిరుచిని పెంచుకున్నట్లే కదా! ఇది కాక పైన నేను చెప్పిన అమ్మాయిలా –ఈ ఆధ్యాత్మికత తాలూకా వైబ్రేషన్ గుర్తించి  వాళ్ళు ఆలోచించి, ప్రతిస్పందిస్తున్నట్లే కదా! ఇది ఎంతో ఆశాజనకమైన విషయం. మరెంతో ముదావహం.కాదంటారా! ఈ ప్రచారానికి టీ.టీ.డీ., మన గాయక బృందాలు, మీడియా అందరిని అభినందించాల్సిందే! ఈ కార్యక్రమంలో ఆ అమ్మాయి చెప్పినట్లు అలాంటి చిన్న చిన్న లోపాలున్నా తీసిపారేయ్యాల్సిన ప్రయత్నం మాత్రం ఎంత మాత్రమూ కాదు!

    యువతలో తొంభై శాతం మంది బీటు ప్రేమికులే అన్న తప్పుడు అభిప్రాయంలో వున్నవారందరూ వారి వారి అభిప్రాయాల్ని తరచి చూచి మార్చుకోవాల్సిన తరుణం వచ్చిందేమో!  
    కాబట్టి ఊరకే యువత ని తప్పు పట్టేకంటే పరిస్థితి శృతి మించ లేదు కనుక మనం వాళ్ళ కేమి ఇవ్వగలమో ఆలోచిద్దాం!

7 వ్యాఖ్యలు

Filed under Uncategorized

మీనాక్షి లేఖలు -8

డియర్ కృష్ణయామిని!

చాలా రోజులైపోయింది. నీకో ఉత్తరం ముక్క వ్రాసి! ఏమిటో ఏ రోజూ తీరిక చిక్కదు. ‘కానీ ఆదాయం లేదు..క్షణం తీరిక లేదులా వుంది పరిస్థితి ‘.ఎలాగో ఓలాగ నీకు వ్రాసి తీరాలన్న కృత నిశ్చయంతో కూర్చున్నా. నిన్న రోడ్ మీద పోతూవుంటే సడన్ గా శాంతి కనిపించింది. ఆ మాటా ఈ మాటా చెప్పుతూ ఇంటిదాకా లాక్కొచ్చేసాను. వెంట వేరొక స్నేహితురాలు కూడా వుంది.ముగ్గురం కాసేపు అవి ఇవి మాట్లాడుకుంటామనుకున్నా. ” చాలా సేపైయింది! మీకంటే ఫర్వాలేదు నాకు ఈయన వచ్చేస్తారు. తను వచ్చాకా నేను లేక పోతే ఈయనకి ఒక్క క్షణం తోచదు. అందుకని ఆఫీసు నుండీ ఎప్పుడు ఇంటికే వెడతాను. ఈవేళ ఇక  తప్పదు కనుక మీతో బజారు కొచ్చాను…” ఇలా సాగిం  ది ప్రతీ రెండు నిమిషాల వ్యవధిలో ఆవిడ నడక. నాకు ఒళ్ళు మండింది.
“ఏమి కొనాలని వచ్చావే శాంతి…” అన్నాను.
“నేను కాదు ఆవిడకే నేను కొనే చీరల షాప్ చూపె ట్ట మంటే వచ్చాము. ఇంతలో నువ్ కలసి ఇటు లాక్కొచ్చావు ” అంది.
“అవునండీ! నా కోసమే వచ్చారు ఆవిడ! అయినా నేనెప్పుడూ ఆయనతోనే వెడతాను.నా బుద్ధి ఎక్కడికి పోయిందో ఈవేళ  ఇలా బయలుదేరాను.ఆయనేమంటారో ఏమిటో…ఏమీ అనరులెండి. ఊరకే నా భయం.”–ఈ విధంగా ఆవిడ అరక్షణానికొక సారి వాళ్ళ ఆయననీ, తనకూ ఆయనకూ వున్న బంధాన్ని, తను దేనికి కట్టుబడివుంటుందో దేనికి అతిక్రమిస్తుందో…ఇత్యాది వివరిస్తూ అటు శాంతిని గానీ ఇటు నన్నుగానీ మాట్లాడుకోనీయ కుండా చేసింది.ఒళ్ళు మండి నేను బొట్టుపెట్టి పంపించేద్దామని కుంకుమ భరిణే తీసేను. ఆవిడకి బొట్టు పెట్టి శాంతి కేసి తిరిగాను.అంతే, ఏదో ఉపద్రవం జరిగినట్లు ఆవిడ నా చేయి పట్టుకుని “ఆ…ఆ” అంది.నేను ఖంగారుపడి చూసాను ఏమిటన్నట్లు.
“ఏమీ లేదూ…ఈ వేళ శుక్రవారం ప్రొద్దు వచ్చేసిందీ…మీకు అభ్యంతరముంటుందేమోననీ…మర్చిపోయారేమోననీ…” అంటూ నానిచేసింది. నాకు కోపం నషాలానికంటింది. “శాంతితో నాకు పరిచయమై పన్నెండు ఏళ్ళవుతోంది.మీరు నాకు శాంతిని గూర్చి తెలియజేయాల్సినివీ,గుర్తుచేయాల్సినవీ ఏమీ లేవు. మీ కభ్యంతరమైతే మీరు తీసుకోకండి. శాంతీ! నువ్ తీసుకో!” అని తాంబూలం ఇచ్చేను.శాంతి మాట్లాడకుండా తీసుకుంది. ఏమనుకుందో ఏమో ఆ మహా పతివ్రతకూడా తీసుకుంది.నీకు తెలియనిదేముంది శాంతి భర్త పోయి రెండేళ్ళవుతోంది.

ప్రొద్దున్న ఫోన్ చేసి శాంతినడిగాను–“ఎవరా నమూనా?” “మా ప్రక్కనే వుంటారు. మనిషి మంచిదే! మాట తీరువే అంత! మనిషికి మనిషి తోడంటారు కదా! నేనున్న పరిస్థితుల్లో ఏ వేళప్పుడు ఎవరితో అవసరమొస్తుందో అని నేను రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుంటాను. నేను నా పనులకి ఆవిడ దగ్గరకి వెళ్ళేది తక్కువే!”
“అది సరే! మొగుడు అనే వాణ్ణి తనకున్న క్వాలిఫికేషన్ లా నిమిషానికొకసారి నీకు లేడు నాకున్నాడంటూ వాగుతోంది పైగా పిచ్చి చాదస్తాలూ,నమ్మకాలూ కూడా వున్నట్టున్నాయి…భరించడం కొంచెం కష్టమే! నువ్వు స్ట్రాంగ్ గా వున్నంత సేపూ ఫర్వాలేదు. ఏదైనా వీక్ మూమెంట్ లో నిన్ను సెల్ఫ్-పిటి లోకి దిగజార్చేస్తుంది జాగ్రత్త!స్నేహితులు లేక పోయినా ఫర్వాలేదు కానీ ఇటువంటివారుండ కూడదు.నిజంగా! వాళ్ళది అంత అన్యోన్య దాంపత్యమా? అది మనకనవసరమనుకో…అయినా జస్ట్ క్యూరియాసిటీ అంతే!” అన్నాను.
   శాంతి గలగలగలా మంది”నువ్వేమీ మారలేదేం! అదే ఆవేశం! అదే ఆప్యాయతా! అదే విసురూ! ఏమీ ఫర్వాలేదు. నేను ఇలాంటివాటెన్నిటికో అలవాటు పడిపోయాను.పూర్ లేడి! ఈవిడ తన ఐడెంటిటీనీ పూర్తిగా కోల్పోయానన్న విషయం కూడా మర్చిపోయింది.దానినే పణంగా పెట్టి అతని ఆదరణ పొందుతోంది.అయితే ఒకటి అది ఆవిడ ఎప్పటికీ గ్రహించకూడదని  నేననుకుంటాను. ఎందుకంటే!పాపం! అది తెలుసుకున్న మరు క్షణం ఆమెకు తన బ్రతుకునెంత వ్యర్థంగా గడపిందో తెలుసుకుంటుంది.ఇంతకీ ఆవిడకి నేనంటే కోపమో! నన్ను కుళ్ళబొడవాలనో కాదు! అది అవిడ ధోరణి అంతే! తనకి తను తన భర్త పట్ల అనురాగాన్ని రీ అస్స్యుర్ చేసుకుంటున్నట్లనిపిస్తుంది…నా గురించి నేనూ కార్తీక్ ఎలా వుండేవాళ్ళమో అది అమ్మ దగ్గర గుర్తు చేసుకుని బాధపడుతూ వుంటుండి.ఏ చానల్ కా చానల్ సెపరేట్….మొత్తనికి మనిషి మంచిదే!”

“హమ్మయ్య!” రాత్రంతా శాంతిని గూర్చి ఆలోచించిన  నాకు ప్రాణం లేచివచ్చినట్లైంది.శాంతి సెన్సిటివ్ గా లేదు. ఇంకా పైగా తన పరిధికి మించి బ్రాడ్ మైండెడ్ గా వుంది.భార్యా భర్తల నడుమన అనురాగం, అభిమానం, ఇంకా పోట్లాటలూ(చిన్న చిన్నవేలే) వుంటేనే బెటరేమో! ఇలా ఒకరు పూర్తిగా సబ్ డ్యూడ్ గా వుండి తద్వారా అనుకూలవతి అనో, ఆదర్శ పతి అనో బిరుదు సాధించేకంటే! అవునా? అప్పుడప్పుడు ఓ మాట అనుకున్నా, సరిదిద్దుకున్నా, ఇద్దరి సమానత్వాన్నీ ఇద్దరూ కాపాడాలి కదూ! ఏది ఏమైనా ఈవిడ వల్ల శాంతి ఐడెంటిటీకి ఏ హానీ జరగలేదని శాంతి నోటి నుంచే విన్నాక నేను కొంచెం ఊరట పొందాను. శాంతిని అభినందించకుండా ఉండలేకపోయాను.

వుంటా మరి! నేనూ అననా “మావారొచ్చే! టైం అయ్యిందనీ?”.సర్లే! ఊరకే అన్నాను.
ఇట్లు,
మీనాక్షి.

7 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి లేఖలు