Monthly Archives: జూన్ 2009

నేనూ -నా తరువాత తరం(2)

నేను ఏది మాట్లాడినా నా చిన్ని ప్రపంచంలో నాకెదురైన అనుభవాలనాధారంగా చేస్కునే మాట్లాడుతాను.”నీకేం తెలుసు! నిమ్మకాయ పులుసు…” అనుకున్నవారిని గురించి నేనసలు పట్టించుకోను. వారు వారి ఆలోచనా సరళిని కొనసాగించవచ్చును.ఎందుకంటే నాకేదో తెలుసనీ, అది నా కెదురైవాళ్ళందరికీ చెప్పాలనీ నేను ప్రయత్నించటం లేదు.అందుచేత నాకు నిమ్మకాయ పులుసు మాత్రమే తెలుసని అనుకున్నా నా కేమీ అభ్యంతరం లేదు.అదైనా తెలుసు అన్నందుకూ, అనుకున్నందుకు సంతోషం! ఒకింత గర్వం కూడానూ!

ఇక అసలు విషయంలోకి వస్తే –నేను బ్లాగ్ ప్రపంచంలోకి అడుగిడిన కొద్ది రోజులకే తెలుసుకున్నాను–బయట ప్రపంచం కంటే ఇక్కడ అనుమానాలకూ,సందేహాలకూ,ఇత్యాదులకు ఆస్కారం ఎక్కువని! బయట ప్రపంచంలో నిఖర్సైనా,నిర్ధిష్ఠమైన కారణం వుంటుంది, ఒక మనిషిని ద్వేషించడానికైనా, ఇష్టపడడానికైనా.కాని ఇక్కడ అన్ని “assumed” గానే జరుగుతాయి!

అది నిజానికి ఇంకా ప్రమాదం!

నాకెందుకో  W.H. Auden  వ్రాసిన “Telephone Conversation పద్యం గుర్తుకు వస్తుంది బ్లాగ్ ప్రపంచం లోకి అడుగిడిన తరువాత! ఆ పద్యం మీకు తెలిసినదే గా! ఓ శ్వేత జాతీయురాలు, తన ఇంటిని ఒక నల్లవాడికి అద్దెకు ఇవ్వ నిరాకరిస్తుంది. ఒక చిన్న టెలీపోను సంభాషణ ఈ చర్యకు ఆధారము! టెలిపోన్ ద్వార అతనిని నల్లవాడిగా గుర్తించి, అతి నాగరికంగా నే నిరాకరిస్తుంది, అయితే అతని జాతిని అతనికి  గుర్తు చేస్తునే! అదే విధంగా ఇక్కడా కొందరు కొందరికి దగ్గర కావడానికీ, కొందరు ఇంకెందరికో దూరం కావడానికీ  బ్లాగ్ ప్రపంచంలో ఆదారం మనం పెట్టే పోస్ట్లే! అయితే ఈ పొశ్ట్ల లో కొంత వరకూ మన వ్యక్తిత్వం ప్రతిబింబించినా ఆసాంతం మాత్రం ప్రతిబింబించవు! అయితే ఇది నిజ జీవితం లో ముఖతహా మాట్లాడినప్పుడు కూడా జరుగుతుంది. ఒక్కటే తేడా! అక్కడికంటే బ్లాగ్ లోకం లో ఒకింత పెర్సెంటేజ్ ఎక్కువ!

హమ్మయ్యా!ఉపోద్ఘాతం పూర్తి అయ్యింది! ఇక విషయంలోకి వచ్చేస్తా!

ఇప్పుడిక చెప్పబోయేదేమిటంటే నేను ఈ బ్లాగ్ లోకానికీ తిన్నదరగకా, తీరుబాటు ఎక్కువగా వుండీ , తోచుబాటు కాని క్షణాన అడుగు పెట్టాను. అంతే కాని నాకు ఈ హిట్టులు, బిట్టులు గురించి అసలు తెలీదు, అప్పుడు. కేవలం ఏదో కొద్ది స్నేహితులను సంపాదిద్దామని అనిపించి వచ్చాను. అయితే, నేను అడుగు పెట్టినప్పుడే  యాదృచికముగా ఓ బ్లాగ్ లోకి అడుగు పెట్టి అక్కడ బూతులూ, స్త్రీ-పురుష వివాదాలూ లంటివి చూసి ఖంగుతిన్నాను.అయితే వాటంతటవే సద్దుకు పోయాయి. ఆ తరుణంలోనే సరదాకి “ఒఖ్ఖ మగాడు” మొదలు పెట్టాను.అప్పుడొచ్చింది  నాకు ఓ యువ మిత్రుని నుండీ ఓ ఈ మెయిలు. నాకు చాలా ప్రోత్సహాన్ని, సంతోషాన్నీ కలుగ జేసింది ఆ మెయిలు. “చాలా బాగా రాస్తున్నారే! రాయడం ఆపకండీ, రాస్తూనే వుండండి…”
ఒక్కసారి నా మీద నాకు నమ్మకం కలిగింది. అదే మిత్రుని దగ్గర నుండి మరో మెయిల్ అందుకున్నాను. సారాంశమేమిటంటే నా సమీక్ష చదివి శ్రీపాద వారి పుస్తకాలు కొనుక్కునానంటూ తెలియ జేసారు. నేను నా తరువాత తరం వారి కి నా ముందు తరం వారిని గురించి ఆసక్తికరంగా తెలియజేయ గలిగాను అన్నది నిజంగా నాకు ఆనందదాయకమైన విషయమే! ఆ కారణం చేత నేను వరుసగా రోజుకి ఒక పోస్ట్ పెట్టాను కానీ హిట్టుల మోజులో మాత్రం కాదు!

అయ్యా!యువతకి వెన్నెముక వుందో లేదో నాకనవసరం! యెదుటివారిని ప్రోత్సహించే విశాలమైన హృదయం మాత్రం వుందని నాకెదురైన అనుభవాల ద్వారా నేను గ్రహించగలిగాను. అదేమిటో! ఈ బ్లాగ్ ద్వారా నాకు మిత్రులైన వారు నా కన్నా చాల చిన్నవారే! ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే నన్ను బ్లాగ్ లోకానికి పరిచయం చేసిన వారిరువురూ కొద్దిగా ప్రముఖులనే చెప్పవచ్చును! అయితే ఈ యువ మిత్రునికి వారిరువురి బ్లాగ్లు అసలు పరిచయమే లేదుట! నేను చెప్పిన తరువాత వారి బ్లాగ్ లు చూడడం మొదలు పెట్టారుట !ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ మిత్రుడు నాకు ఒక అమేరికా నివాసి అయిన కూతురినీ, అల్లుడినీ వూహించుకుని “వారి కోసం మీరు బ్లాగ్ ప్రపంచం లోకి అడుగు పెట్టారా?” అంటూ ప్రశ్నించారు. నాకు నిజంగా సంతోషం వేసింది! వూహలు వాస్తవాలైతే మర్రి బాగుండుననిపించింది! అయ్యా! ఇలాటి సంతోషాల కోసమే నేను బ్లాగ్ లోకానికి అడుగుపెట్టింది!  నేటికి పోయి మరల తీరిక చిక్కిన పిమ్మట కలుసుకునెదము. అంతవరకూ ఇంతే సంగతులూ చిత్తగించవలెను !:)

ప్రకటనలు

1 వ్యాఖ్య

Filed under Uncategorized

మీనాక్షి గూటి గువ్వలు-2

మా లవకుశులు ఈవేళ ఎగిరిపోయాయి!వాటి పరిణితి ఫోటోలుగా చూడండి!

Image(671)

Image(674)

Image(689)

Image(691)

Image(693)

7 వ్యాఖ్యలు

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి గూటి గువ్వలు

మా లవ కుశులు పెద్దవయ్యాయి. ఫోటోలు చూడండేం!

Image(653)

Image(654)

5 వ్యాఖ్యలు

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కూనిరాగాలు-30

GXVE01 

నన్ను కదిలించే మరో పాట.మన దేవులపల్లివారిదే!ఈ పాటలో వేదన వుందో,ఆవేదన వల్ల జనించిన నిర్వేదముందో ఖచ్చితముగా చెప్పలేను కానీ, ఒకసారి విన్న తరువాత మరువలేని పాట!

“నీ అడుగు దోయిలో నిత్యామృతమధువు నిండిపొరలూనయ్య దేవా!
నిరుపేదలకేని, కరకు పాపులకేని దొరకునంటారయ్య దేవా!

                 నీ అడుగు దోయిలో…

చీకటింటిలోన చీకు సంకెళ్ళలో
చివికిపోయానయ్య దేవా!
చావో,బ్రతుకో తెలియజేయ నీ మనుగడ
చాల మరగితినయ్య దేవా!

                     నీ అడుగు దోయిలో…

అడుగు శిలయై నాలుగడుగులు నేను
నడచి రాలేనయ్య దేవా!
అడుగునందించెదవో, అమృతమందించెదవో
ఆశ విడలేనయ్య దేవా!

                   నీ అడుగు దోయిలో…

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు