Monthly Archives: జూలై 2009

ఉలవ చారు- సుళువు పద్ధతి

SuperStock_1538R-55402
ఉలవలు-100గ్రా ఎండు మిర్చ్-8 నుండి 10 వరకు ఇష్టానుసారం, ఇంగువ-చిటికెడు, జీలకర్ర-1 చెంచాడు, ఉప్పు-1 నుండి 1 1/2స్పూ,(ఇష్టానుసారమే!)
ఉలవలు మూకుడులో వేసి, సన్న సెగ మీద వేపి, కొంత వేగాక, ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి, చివరలో జీలకర్ర కూడా వేసి వేయించి, ఉప్పు కూడా వేసి పొయ్యి మీద నుంచి దించి మిక్సీలో మెత్తగా పొడి కొట్టాలి.
ఇక మీరు రోజూ చేసే చారులోనే ఈ పొడి ని కలుపుకోండి. చారు పొడి, ఉల్లిపాయాలు, వెల్లుల్లిపాయాలు ఇవి అన్నీ షరా మామూలే! ఇకపోతే ఈ పొడి ని మీరు కందిపొడిలా అన్నం లో డైరెక్ట్ గా కలుపు కోవచ్చును కూడా! బాగానే వుంటుంది! అయితే ఒక  చిన్న ముప్పు! నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ వేసుకుని అన్నం లో కలుపు కోవాలి. అద్గదీ విషయం! కొలెస్ట్రాల్, ఒబీసిటి అంటూ భయ పడే వాళ్ళు ఇలా అన్నం లో కలుపుకుంటే –? ఇంతే సంగతులూ చిత్తగించవలెను 🙂

5 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి గరిట గిరికీలు

మీనాక్షి కూనిరాగాలు-32

h

“రాగాల తోట లోన రమ్యమైన గీతముంది.
ఆలపించు ప్రియుడు రాక, కనుల వాకిట నిలచి వుంది!

వసంతాలు వెడలి పోయే
వయారాలు బడలిపోయే
వడలి పోయిన పూవు వోలె
బెడద కనుల వేచి వుంది.

రాగాల తోటలోన ….

గీతమే అనంతమాయే
గీతి విభుడు రాకపోయె
కవి కలమున నిలచి తా
విరహగీతమాయెనేమో!

రాగాల తోటలోన ….”

6 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు-31

n1

చల్లగాలినే పిల్లనగ్రోవిగా(2)
మెల్లమెల్లగా ఊదే స్వామీ
ఎవరయ్యా? నీవెవరయ్యా? (2)

గుసగుస లాడే గులాబీలో
మిసమిస లాడే పసిపాపలలో
మసక మసకగా నీ దివ్య రూపం
మా కన్నులకూ కనిపించేనయ్యా
ఎవరయ్యా? నీవెవరయ్యా?(2)
చల్ల గాలినే….

అంతే లేని ఆకాశానికి ఆవల వున్నావో(2)
ఎంతో ఎంతో దగ్గరగా వున్నావో(2)
ఎవరయ్యా? నీవెవరయ్యా?(2)
చల్ల గాలినే….

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు, Uncategorized