Monthly Archives: సెప్టెంబర్ 2009

మీనాక్షి కూనిరాగాలు-36

woman-and-child-copy2

ఒల్లరె మావోయ్ సాములోరన్న
నేనొల్లరె మావోయ్ సాములోరన్న
జరుగుజరుగుమన్న
నే జరగలేనన్నా….
ఒల్లరె మావోయ్….
నందివాహన గజానన
చిలుకవాహన గజానన
మూషిక వాహన గజానన
పాహి పాహి గజాననా
పార్వతినందన గజానన(2)
ఒల్లరె….
కొండెక్కిపోవ్వాలా
నే పూవుకోయ్యాలా
ఎగువ యాదగిరి
దిగువ జొన్నవడ
ఒల్లరె….

ప్రకటనలు

7 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు-35

2183020327_b58ae4301a_oనిన్నటితో 100 పోస్ట్స్ అశ్వినీశ్రీగా పూర్తి చేసానండి. నిజం చెబుతున్నాను ” మీనాక్షి కూనిరాగాలు” మొదలుపెట్టినప్పుడు నాకు ఇన్ని పాటలు గుర్తున్నాయని తెలీదు.మహా అయితే ఓ పదో పన్నెండో వ్రాయగననుకున్నాను. కాని సంఖ్య ఇప్పుడు 35 కి చేరింది. ఇదంతా పరోక్షంగా మా శ్రీవారూ, కస్తురి పద్మగారూ, కామెంటేసేసి మీరు అందరూ బాధ్యులే(బాధితులే= బాధలు పడ్డవారు, ఈ విగ్రహ వాక్యం బాగుందా? ఉషగారూ!). అందుకు మీకు మరో జనపదం. సునీతగారూ దీనికి కూడు డాన్స్ బ్రహ్మాండంగా కూర్చ వచ్చు! కాబట్టి మీ పాపని రెడి చేసేయండి.

“నోమీ నోమన్నలాల నోమన్నాలల చందమమా చందమమా
చుక్కల్లో సూరీడు సూటిగా పోడిసేడు(2)
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల….
ఆ సేల్లో కోతలు
ఈ సేల్లో కోతలు
వరిసేల్లో కోతలకే కూలీ జాస్తి అంట
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల….
ఆ వూరి మారాజు అర్థాణా ఇస్తాడు
ఓ సందామావయ్యలో
ఈ వూరిమగరాజు  ముప్పావలిస్తాడు
ఓ సందామావయ్యలో
ఆ వూరి మారాజు అర్థాణా ఇస్తాడు
ఈ వూరిమగరాజు  ముప్పావలిస్తాడు
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల…
ప్రొద్దు పొవ్వక ముంది ఇంటీకి సేరాల
పిల్లాపాపల కింత కూడైనయెట్టాలా
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల…”
(వుంటా మరి! ఇంట్లోని మగరాజుకి టీ అయినా పోయ్యాలా
పోయోస్తానమ్మ బ్లాగింటి సునీతమ్మ సందామామ సందామామ:) 🙂 🙂 )

16 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి గరిట గిరికీలు-3 ( వామాకు తో మజ్జిగ పులుసు)

మీనాక్షి గరిట గిరికీలు-3 ( వామాకు తో మజ్జిగ పులుసు)
పులుసు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇంట్లో ఏమీ దొరకక పోతే ఈ పులుసు త్రై చేయండి!  వామాకు కుండీలలో సాధారణముగా దర్శనం ఇస్తూనే వుంటుంది.
వామాకు-2 కొత్తిమీర,  పచ్చిమిర్చి, వెల్లుల్లి-2 రెబలు. ఉల్లి-1,అల్లం-చిన్న ముక్క,ఇంట్లో ఏ కూర ముక్కలుంటే అవి _5 ఉప్పు, సనగపిండి-1స్పూన్ మజ్జిగ-చిలికినది!
ముందుగ వామాకు గ్రైండ్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.తరువాత అల్లం పచ్చి మిర్చి, వెల్లుల్లి,ఉల్ల్లిపయ కచ్చ బద్దగ గ్రైండ్ చేయాలి. కారం కలర్ రెండూ కావాలౌనే వారు ఒక ఎండు మిర్చి కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఇది కాక కొబ్బరి వుంటే అది కూడా కలుపుకోవచ్చును.ఇప్పుడు మూకుడు పెట్టి తరగి వుంచిన కూర ముక్కలని నూనె లో మగ్గించి తరువాత, అల్లం వెల్లులి వగైరల పేస్ట్ వేసి ఓ నిమిషం మగ్గనివ్వాలి. అటుపై వామాకు పేస్ట్ వేసి, మగ్గ నిచ్చి తరువాత మజ్జిగలో సనగ పిండి కలిపి ఈ మిస్రమాన్ని అందులో పోస్తు ముద్దకట్టకుండా చూసుకుంటూ,ఓ రెండు పొంగులు రానివ్వాలి. తరువాత మీ జ్జిగమ సులుపు రెడి!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి గరిట గిరికీలు

మీనాక్షి తడి తడి రాగాలు—అనురాగాలు-6

మీరు నమ్మండి నమ్మక పోండి! నేను డిగ్రి చివరి సంవత్సరం లో వుండగా  మా ఇంటిలోకి టి వి , టేప్ రికార్డర్  వచ్చాయి.  అంతవరకు నేనూ, నా పైన అయిదుగురు కూడా అది కావాలని  అనుకోలేదూ, లేదని బాధపడ లేదు.సాయంత్రం తోచక పోతే కృష్ణ తీరంలో వున్నప్పుడు నది ఒడ్డుకి, గోదావరి ఒడి చేరినప్పుడు ఆత్మీయముగా ఆవిడ దగ్గరకి వెళ్ళేవారం. ఎన్నడైనా ఓ సినిమా. అది కూడా ఏడాదికి  మూడే! మూడు సెలవల్లోనూ మూడన్న మాట!
ఇంతకీ నేను చెప్పబోయే దేమిటి అంటే! మా పెద్దక్క శేషవేణి సాయంత్రం వేళ తను ప్రొద్దుపోక పాడుకునే జానపద గీతాలకి మా మూడో (గంభీరక్క) అక్క డాన్స్ కూర్చి , నా చేత గెంతించేది ! చిన్నదాన్ని కదూ! భలే ఆడించేవారు నన్ను!  ఆ పాట ఎందుకో గుర్తుకు వచ్చింది ! పాట ఇదిగో!
“ఉళ్ళిమళ్ళ చీర కట్టి
కచ్చలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనొస్తిరో
ఓరోరి మావ,
ఉన్నవాళ్ళ పిల్లనొస్తిరో
ఉళ్ళిమళ్ళ………
ఉన్నవాళ్ళ పిల్లానంటే
కన్ను గీటి రమ్మన్నావు
కంటిబాసలు నాకు వద్దురో
ఓరోరి మావ
కంటిబాసలు నాకు వద్దురో
ఉళ్ళిమళ్ళ………
గున్నమావి గుబురు మాటుకి
కబురులాడ రమ్మన్నావు
గుట్టు మాటలు నాకు గిట్టవురో
ఓరోరి మావ
గుట్టు మాటలు నాకు గిట్టవురో
ఉళ్ళిమళ్ళ………”

6 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు-34

radha-wating-krishna-2821
ఈ పాట కూడా చెప్పుకోదగినదే! ఉగాది సంబరలలో  శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడినది!
“మధుర కాదు, యమున లేదు
నేనున్నా,నేనున్నా
యుగయుగాల ఆరాధన ఈ రాధ ఈ రాధ.
మధుర….
నీల జలధి నిలుపు వ్రాలు
యమున నీట తేలే
ఆమెను తాక యమున శ్యామ సుందర సుమమాయెను
మధుర….
అధరమాన ఆశ లేదు
మురళిగ నే మారలేను
యుగయుగాల ఝరిలో
ఒక పదమునై పోవాలని ఈ రాధ ఈ రాధ.
మధుర….

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కూనిరాగాలు-33

ఈ పాట విని మరచిపోయిన ఆడపిల్ల ఆంధ్ర దేశంలో వుంటుందని నేననుకోను.ముఖ్యంగా ద్వారం లక్ష్మిగారు పాడినది వింటే!
“పువ్వులేరి తేవే చెలి
పోవలె కోవెలకూ(2)
నీవలె సుకుమారములు
నీవలెనే సుందరములు
ఫువ్వు….
ఆలసించినెటులే
పూజావేళ మించిపోవు
ఆలయమ్ము మూసి
పిలుపాలింపడు నా విభుడూ
ఫువ్వు…..

మాలలల్లుటెపుడే
నవమంజరులల్లుటెపుడే
ఇక పూలే పోయాలి
తలంబ్రాలల్లే స్వామి పైన
ఫువ్వు…..krishnalila1

2 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

జయకాంతన్ కథలు-3(ఎవరి ఆంథర్యం వారిది-2వ భాగం)

కథ లోకి వెడదామండి! వేణు తల్లితండ్రులై సుందరంగారు,రమాదెవిగారలు సంఘం మెచ్చుకునే విధంగా, అంటే గౌరవనీయంగానే జీవిస్తుంటారు. ఆ ఇంటిలో ఆధునికథ ఎక్కడ కనిపిస్తుందంటే చిన్నవారికైన , పెద్దవారికైనా, ఎవరి ఇష్టాఇష్టాలకనుగుణంగా, స్వేచ్చయుత జీవినం సాగించవచ్చును. ఆ కారణం చేతనే తన పెళ్ళిని వ్యతిరేకించిన తన తల్లితండ్రుల దగ్గర పెరగాలనే కోరికని మన్నిస్తూ అతనిని తాతగారి దరి జేర్చారు. వేను యుక్తవస్కుడైన తరువాత ఓ సారి సెలవలికి వచ్చి  తన తండ్రికి వేరొక స్త్రీ తో గల సంబంధం గూర్చి తెలుసుని మధన పడడంతో కథ ప్రారంభం అవుతుంది.
వేణు తన తల్లికి అన్యాయం జరుగుతోందని భావించి తండ్రిని నిలదీలనుకుంటాడు. అయితే ఈ విషయం నిర్ధారిచుకోవడం కోసం “కీ హోల్ మొరల్స్” పరిదిలోకి వెల్లిపోయి తండ్రి వ్రాసిన ప్రేమలేఖల దగ్గరనించి అన్ని క్షుణ్ణంగా తెలెఉసుకుంటాడి. ఆ క్ష్ణం లో అది తప్పుగా అతని అనిపించలేదు.మొత్తాకి ధైర్యం చేసుని తండ్రిని వంటరిగా వున్నప్పుడు నిలదీసే ప్రయత్నం చేస్తాడు. ఆ సంభాషణ ఈ క్రింద చూడండి:
“మీరింకొంకరు ఇంకొకరూ కాకపోతిరి. నేను సాక్షాత్తుగా మీకు కుమారుడినై పోయాను. ఇలాంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడవలసిన అవాచనీయ పరిస్తితి ఈరపడినందుకే నాకు విచారంగా వుంది. జరిగిందేమిటో జరిగిపోయింది. ఇక మీదట ఇలా జరకుండ వుండాలని నా వుద్దెస్యం…అందుకనే ఇలా చెబుతున్నాను…”
కథ లోకి వెడదామండి! వేను తల్లితండ్రులై సుందరంగారు,రమాదెవిగారలు సంఘం మెచ్చుకునే విధంగా, అంటే గౌరవనీయంగానే జీవిస్తుంటారు. ఆ ఇంటిలో ఆధునికథ ఎక్కడ కనిపిస్తుందంటే చిన్నవారికైన , పెద్దవారికైనా, ఎవరి ఇష్టాఇష్టాలకనుగుణంగా, స్వేచ్చయుత జీవినం సాగించవచ్చును. ఆ కారణం చేతనే తన పెళ్ళిని వ్యతిరేకించిన తన తల్లితండ్రుల దగ్గర పెరగాలనే కోరికని మన్నిస్తూ అతనిని తాతగారి దరి జేర్చారు. వేను యుక్తవస్కుడైన తరువాత ఓ సారి సెలవలికి వచ్చి  తన తండ్రికి వేరొక స్త్రీ తో గల సంబంధం గూర్చి తెలుసుని మధన పడడంతో కథ ప్రారంభం అవుతుంది.
వేణు తన తల్లికి అన్యాయం జరుగుతోందని భావించి తండ్రిని నిలదీలనుకుంటాడు. అయితే ఈ విషయం నిర్ధారిచుకోవడం కోసం “కీ హోల్ మొరల్స్” పరిదిలోకి వెల్లిపోయి తండ్రి వ్రాసిన ప్రేమలేఖల దగ్గరనించి అన్ని క్షుణ్ణంగా తెలెఉసుకుంటాడి. ఆ క్ష్ణం లో అది తప్పుగా అతని అనిపించలేదు.మొత్తాకి ధైర్యం చేస్కుని తండ్రిని వంటరిగా వున్నప్పుడు నిలదీసే ప్రయత్నం చేస్తాడు. ఆ సంభాషణ ఈ క్రింద చూడండి:
“మీరింకొంకరు ఇంకొకరూ కాకపోతిరి. నేను సాక్షాత్తుగా మీకు కుమారుడినై పోయాను. ఇలాంటి విషయాన్ని గురించి మీతో మాట్లాడవలసిన అవాచనీయ పరిస్తితి ఈరపడినందుకే నాకు విచారంగా వుంది. జరిగిందేమిటో జరిగిపోయింది. ఇక మీదట ఇలా జరకుండ వుండాలని నా వుద్దెస్యం…అందుకనే ఇలా చెబుతున్నాను…”

సమాధానం చెప్పగల తండ్రి , చెప్పకుండా ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి—“వయసు వేరు; అనుభవం వేరు. అనుభవం వేరు; అందులోనుంచి పొందగలిగే పరిణితి వేరు” అనిపించి , తమ అభిప్రాయాన్ని మార్చుకుంటు విషయాంతన్రంలోకి వచ్చేసేరు.
ఇదండి విషయం. రచయత తను చెప్పదలుచుకున్న విషయం కథ నట్ట నడిమినే చెప్పేసేరు. కాని మనం మిగతా పది పేగిలు చదవగలిగేలా చేయడమే జయకంతన్ గారి ప్రత్యేకత అని చెప్పాలా వేరేను!
సరే! సుందరంగారేమంటున్నారో ఓసారి వినండి.—“సరే బాబూ! ఇప్పుడు నీకు సంబంధం లేని విషయం గురించి నువ్వు బాధ పడ్డమెందుకు?”….”చూడు వేణు! నువ్వేమో వయసొచ్చిన వాడివని చెప్పుకుంటున్నావు? ఆ మాట నిజం కాదని నేననడం లేదు. కాని వసొచ్చిన ప్రతి మనిషిలోను బుద్ధి వికాసం జరగదేమోనని నాకిప్పుడనిపిస్తోంది. నీకు నేను తండ్రినన్న కారణం వల్లి నా ఆతరంగిక వ్యవహార కన్నింటికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన ఆవశ్యకత నాకేమి కనిపించడం లేదు.”

మెత్తగా కొడుకు చేసిన తప్పు ఎత్తి పొడుస్తూనే , తన గౌరవం కాపాడుని బధ్యత తనదే నని కూడా తెలియజేస్తాడాయన. విధిలేక తల్లి ని కదిపి చూస్తాడు వేణు. అక్కడ నుండి కూడా అటువంటి అనుభవమే ఎదురవుతుందతనికి.ఆవిడ రియాక్షన్ ఇక్కడ చూడండి” —“కాదయ్య వేణు ! నూవ్వేమిటో ఇక్కడి మనుషులు పప్ పై మెరుగుల క్రింద కృతకమైన జీవితాలు గడుపుతున్నాటున్నావు. ఏమిటి? నువ్వు తొందరపడి అలాంటి నిర్ణయాలకు రావచ్చా?నువ్వు దేన్ని పై పై మెరుగులంటావ్ ? అన్ని రకల జీవితాల్లోనూ ఏదో ఒక స్థాయిలో పై పై మెరుగులనేవి వుండనే వుంటాయని నీకు తెలియదూ?దేన్ని గురించి బాబూ నువ్వు బాధ పడడం? నీ మనసెక్కడో బాగా దెబ్బ తగిలినందువల్ల కాకపోతే నువ్విల మాట్లాడవని నాకు తెలుసు. ఏం, జరిగిందో చెప్పవూ?”
అయ్యింది. ఆవిడా ఇతను ప్రశ్నించడాన్ని అడ్డుకుండి. పతీ పత్నుల మధ్య ఏం జరిగినా అది వారి ఆంతరంగికమే! దీనిలో కుటుంబం , సంఘం వీటికి చొరబడే అవకాశం ఈయకూడదు. ఇస్తే ఆ బంధం చిక్కుల్లో పడినట్లే ! ఈ విషయాని వేణు తల్లితండ్రుల ద్వార రచయిత బహు చక్కగా వివీరిస్తారు. ” The  Constant Wife”   అన్న మాం నవలిక ఈ చదివివారికి కచ్చితముగా గుర్తుకు వస్తుంది. అయితే అక్కడ భార్యా భర్తలు విడిపోతారు. ఇక్కడ ఎవరి సముచిత స్థానాన్ని నిలుపుకుంటూ ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకుండా అన్యోన్య జీవితంసాగిస్తారు. కథ ముగింపు చదివినవారికి ఆ మూడో వ్యక్తితో సుందరంగారికి గల సంబంధం ఎటువంటిదో అర్థమైపోతుంది. ఫాపం! మన వేణు ఈ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేక తిరిగి తాతగారింటి చేరుకుంటాడు.

10 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి సాహిత్య వీక్షణలు