Monthly Archives: డిసెంబర్ 2009

THE MOST INSPIRING SONG THAT HAUNTS ME

Whenever I get depressive thoughts I recollect this psalm and the very next moment, I AM WHAT I AM ALWAYS–the bindaas  bhagawati.  Here is the song:-

“This little guiding light of mine

I am going to  let it shine (2).

Let it shine , all the time let it shine.

Hide it under a bushel Oh! No,

I am going to let it shine (2).

Let it shine, all the time let it shine.

Make my little light burn for thee

I am going to let it shine(2).

Let it shine, all the time let it shine.

Take this little lightround the world

I am going to let it shine(2).

Let it shine,all the time let it shine.

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు

కార్నర్ సీట్-3

ఈ స్టాప్ లో   విండో సీట్ దొరకడం పెద్ద కష్టమైన విషయం కాదు.కూర్చున్నదే తడవు పుష్పకమెక్కినట్లే!విమల విసురుగా ప్రొద్దున్నె ఎలా లేపింది?పైగా చేతిలో చీవిడి కారుకుంటూ పనిమనిషి నరసమ్మ మనమరాలూ…దాని మిల మిల కళ్ళు ప్రొద్దున్నే చూడడం బాగున్నా…విమల చంకలో ఆ ఎనిమిది నెలల కుంకని చూడడం నాకంతగా రుచించలా. అయినా తమాయించుకున్నాను.

“ఏంటి”? అన్నాను.

“నిన్ననే చెప్పాను కదండీ!చిట్టికి పక్కలు వెచ్చ పడ్డాయని!పారాసిటమాల్ వేసినా తగ్గలేదండీ! మనం ఇప్పుడే డాక్టర్ దగ్గరకి వెడదామండీ”

“అంత కంగారు పడద్దమ్మగారూ, మాపాటికి నిమ్మళిస్తుంది.మీరు బాబుగారిని కంగారు పెట్టకండి”పెరట్లోంచి నరసమ్మ గొంతు వినిపిస్తోంది.

విమలకి అసలు ఇదేమీ పట్టట్లేదు.తన ధోరణిలో నన్ను తొందరపెడుతూ నిష్టూరాలాడం మొదలు పెట్టింది.”ఆ రోజున పదేళ్ళవాడు మీ అక్క కొడుకు కాస్త ఎక్కువ తిని కడుపు నొప్పి అనంగానే టాక్సీలో నన్ను కూడా పరుగెత్తించారు. ఈ పిల్ల దిక్కు లేనిదనేగా మీ చిన్న చూపు.దాని ఖర్మ కాలి, దాని అమ్మా,నాన్నా వరదల్లో కొట్టుకుని పోయారు.ఉన్న ఒక్క అమ్మమ్మా తనని తనే చూసుకోలేదుగా. మనకెలాగూ పిల్లలు పుట్టేడవలేదుగా.అందుకు…అందుకు..దానిని పెంచుకుందామనేది..కాని మీకు కిట్టదుగా..ఎందుకంటే అది పనిమనిషి మనుమరాలు…మీ అక్క కొడుకో…అన్న కూతురో కాదుగా..అయినా వాళ్ళకి మన మెందుకండీ…సన్నగా ఆగకుండా కురిసే వర్షంలా.

“విమలా…విమలా” నా పిలుపుతో ఆమెకేమీ సంబంధం వుండదు.ఆమే ధోరణికి ఫుల్స్టాప్ వుండదూ. “విమలా నేను సాయంత్రం మాత్రమే రాగలను. నాకు ఆఫీసులో అర్జ్ టు పని వుంది. ఇంక నువ్వు ఏమి అన్నా,  అనుకున్నా సరే!” చెప్పులు తొడుక్కుని బయటకి వచ్చేసాను.

(ఇంకా ఉన్నది…)1 వ్యాఖ్య

Filed under Uncategorized

కార్నర్ సీట్-2

ఇంకొక సిప్…
ఇంకా అతను రాలేదేమిటిజెప్మా! రోజూ ఈపాటికే ఈ కార్నర్ టేబుల్ కటు వైపు ఆవారా బ్యాగు పెట్టి కిటికీలోనించి బయటకు చూస్తూ ఆలోచిస్తూ వుంటాడే! ఏమిటో అంత ఆలోచించాల్సిన విషయాలు! చూడబోతే పాతికేళ్ళ కుర్రాడు! ఉద్యోగం గట్రా …ఇబ్బందేమో! పెద్ద కుటుంబమేమో! పెళ్ళిళ్ళు కావలసిన చెళ్ళెళ్ళెళ్ళేమో!…
హ్మ్! ఇదేమిటి అతని ఆలోచలనని గురించి నేను ఆలోచిస్తున్నాను.ఆలోచనలైనా అనుబంధాలైనా అంతే! అవి ఎవరివైనా అలుముకుంటూ పులుముకుంటూ పోతే అలాగే అందమైన కలంకారీ సిద్దమౌతుంది!అలాగే గాలి కొదిలేస్తే అవెక్కడో మనమెక్కడో!లేకపోతే అలవాటుగా రోజూ ఒకే హోటల్ లో ఒకే  టేబుల్ పంచుకున్నంత మాత్రాన అతనిని గురించి నేను ఇంత ఎదురు చూడాలా? అయినా అతనితో ఎప్పుడూ ఒక్క చిరునవ్వు కుడా పంచుకోలేదే! ఇప్పుడు పోనీ వైటర్ని వాకబు చేద్దామా…
ఇంకొక సిప్…
అదిగో వచేస్తున్నాడు. “పోనీ ఈవేళ పలకరించుదాం” సిద్దంగా సర్దుకుని కూర్చున్నా. అసలు అతని దృస్టి ఇటువైపువుంటేగా—ఇంతలో నం.16 .కనిపించింది. గబ గబ అడుగు బస్ వైపు పడింది.
******
{ఇంకా వుంది}

5 వ్యాఖ్యలు

Filed under Uncategorized

కార్నర్ సీట్-1


విమల ప్రొద్దున్నించి వేడెక్కించిన  విధానానికి గోల్డ్ స్టార్ టీ కార్నార్ ఒళ్ళో  ఓ సారి తల దూర్చి సేదదీరాలనిపించింది.అయినా ఆ ఆ టీ స్టాల్ ఏమీ కార్నర్లో లేదు. కాని ఆ “కార్నర్” అన్న పదం చూసి దాంట్లో అడుగెట్టడం మొదలెట్టాను. ఈ రోజా–నిన్నా– దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా వస్తున్న అలవాటు.అలవాటనేది చిత్రమైనది. మన జీవిత భాగస్వామిలా ఎలా ఎప్పుడు మనలో ఐక్యమైపోతుందో తెలియదు.
“సార్ కాఫీ” అలవాటైన వైటెర్ నేను నా కార్నర్ సీట్లో కూర్చోగానే అందించేసేడు. బస్సు రావడానికి ఇంకా పది నిమిషాల టైముంది. ఈ లోపున నేను నా స్వేచ్ఛా పుష్పకమెక్కి ఎంత దూరమైనా పోవచ్చన్న మాట!
ఒక్క సిప్. హమ్మయ్య! నాకు తెలిసి ఈ   ఏరియాలో  విమల తరువత బెస్ట్ కాఫీ వీడిదే.
“చీ! ఛీ!” విమలని వీడిని పోలుస్తున్నానేమిటి?కట్…కట్.
(ఇంకా వుంది …)

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-42

ఆంధ్ర తలత్ మెహ్మూద్ గా పేరు గాంచిన  ఎం. ఎస్. రామారావుగారి పాట ఇది. చాలా కాలం తరువాత తాజ్ మహల్ అనే సినిమాలో చేర్చబడిందిట కూడా! ఓసారి చూడండి:-
“ఈ ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా…(2)
పండువెన్నెల్లో వెండికొండల్లే
తాజ్ మహల్ ధవళకాంతిలో…
నిదురించు జహాపనా…నిదురించు జహాపనా…
ఈ ప్రశాంత….
నీ జీవిత జ్యోతి, నీ మధుర మూర్తి
ముంతాజ్ సతి సమీపానే
నిదురించు జహాపనా…నిదురించు జహాపనా…
ఈ ప్రశాంత….

10 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

మీనాక్షి కుర్కురే–ఓ చిట్టి భూతం !


మళ్ళీ  షరా మామూలే.ఓ అమ్మాయి.మహా అల్లరి గడుగ్గాయి.వాళ్ళ నాన్న భోంచేసి కూర్చోగానే ఎక్కి తొక్కడం ప్రారంభించింది.జుట్టు పీకీ, భుజాలెక్కీ ఇష్టారాజ్యంగా ఎగురుతోంది.హఠాత్తుగా నాన్న నోట్లోంచి “బ్రేవ్” మన్న శబ్దం వినిపించింది.ఒక్కసారి మన ఏడాది గుంట బెదిరిపోయింది. గబ గబా అమ్మ దగ్గరికి పోయింది.
“అమ్మా! ఏంటది?” అమ్మని అడిగింది.
అమ్మకి నవ్వు వచ్చింది. అయినా సరే, గంభీరంగా ముఖం పెట్టింది.
“చెప్పనా?”
“చెప్పనా అంట?…” అంది. రెండుసార్లు రెట్టించేసరికి అమ్మాయికి ఆత్రుత, భయం,రెండూ పెరిగాయి.
“అదీ ఓ చిట్టి భూతం. అన్నం తినగానే ఎవరి దన్నా నెత్తెక్కి తొక్కావంటే అల్లాగే బయటకి వస్తుంది.జాగ్రత్త”.
అమ్మగారి తెలివితేటలకి మురిసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ  అయ్యగారు  మరో రకమైన విచిత్ర శబ్దాలు చేసుకుంటూ (ఎందుకైనా మంచిదని…) అదే కుర్చిలో అనంత శయనం వేసేసారు. పాపం!  మన చిట్టి భూతం అప్పటికింకా ఏడాదేగా…అందుకే బెదిరి మళ్ళీ నాన్న నెత్తెక్కలేదు.

3 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి కూనిరాగాలు-41

సీత అనసూయ క్యాసెట్లో విన్నానీ పాట. రైలు బండి తయారి మొదలుగొని, అది పోయే విధానం, ఆ పైన దానిలో ప్రయాణం చేస్తున్న వారి వివరాలు కూడా అందిస్తుంది. ఓ సారి చూడండి.
” బండిరా పొగ బండిరా
దొరలెక్కే రైలుబండిరా, దొరసాను లెక్కే బండిరా

ఈడ కూత కూసేనురా ఆడ కూత కూసేనురా
నీలగిరి సెరువు కాడ నిలసి కూత కూసేనురా
బండిరా…

బండిని సేసిందెక్కడ సెన్నపట్నం ముందర
బండిని కాల్సిందెక్కడ మైసూరు పట్నం లోపల
సెన్నపట్నం ముందరే సిన్ని కన్సాల్లోళ్ళు
ఇంతలింతల బండిని సేసి ఈదులెంబడి తిప్పేరురా
బండిరా…
లచ్చిమంటే లచ్చిమి
దాని అబ్బడాల లచ్చిమి
కోడినిస్తానన్నాది కోడిపెట్టనిస్తానన్నాది
కోడి కాక కాలు రూపాయ్ కల్లు నిస్తానన్నది
సీమల్రోడ్డు పక్కన పోవు సిన్న గుంత కాడ
బాగ బతికిన రెడ్డి కొడుకు భంగపడిందక్కడరా
లచ్చిమంటే సొగుసురా దాని మొగుడు సూత్తే ముసలివాడు
బండిరా….
గమనిస్తే ఈ పాటకి అందం సీత అనసూయ పాడడంలో వుంది.             ఉదాహరణకి “దొరసాని” అన్న మాటని వారు వ్యంగంగా “దొర సాని” అని ఉచ్చరించి పాట యొక్క వ్యంగ్య ధోరణి నిలబెడుతూనే “బండిని సేసిందెక్కడో” ఈ వివరాలన్ని మనకందజేస్తారు. పాట బావుంది కదూ!

6 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు