Monthly Archives: జనవరి 2010

మీనాక్షి కూనిరాగాలు -46

ఆడెను మీరా ఆడెను మీరా(2)

అందెలు ఘల్లనగా…కాలి అందెలు ఘల్లనగా…

ఆడెను మీరా…

బంధువులన్నారు కులనాశిని అని

పలికిరి లోకులు ఉన్మాదిని అని

ఎరుగలేరు వీరెవ్వరు మీరా హరి చరణాంబుజ దాసి అని

ఆడెను మీరా…

రాణా పంపిన విష పాత్రను

మీరా గ్రహియించెను నగుమోముతో

ఆశ్రితావనుడు మీరా ప్రభువే

ఆమెను కరుణించె కడు ప్రీతితో

ఆడెను మీరా…ప్రకటనలు

6 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

కార్నర్ సీట్- 6

“వాట్’స్ ఫర్ లంచ్ సర్?” చనువుగా బాక్స్లో నుంచి ఓ స్పూన్ లాగించేస్తూ అడిగింది డేటా ఎంట్రి ఆపరేటర్.టైం చూసుకున్నాను. ఒంటి గంటైంది. నెమ్మదిగా ఓ స్పూన్ నేనూ నోట్లో పెట్టుకున్నాను.పుష్పకం మళ్ళీ తేలుకుంటూ వచ్చేసింది విమల నెక్కించుకుని…

***

“ఐదేగా అయింది…అప్పుడే వచ్చేసారే?” ఇంకో ఇద్దరితో కలిసొస్తూ విమల అడిగింది. ఎలా చెప్పగలను “నీ కోసమే” అని, అందుకే ఓ నవ్వు నవ్వాను. “అన్నట్లు…ఏదో శుభవార్త విన్నాం నిజమేనా…కంగ్రాట్స్” ఆప్యాయంగా భుజం నొక్కుతూ వెంకట్రావు వెల్లడి చేసేసాడు.విమలకి మాత్రమే నా నోటితో చెప్పలనుకున్న నిజం అలవోకగా జారిపోయింది. “కంగ్రాట్స్” విమల చిరునవ్వుతో అంది. ఇంకేమన్నా అడిగితే బాగుండును.”అబ్బే! అసలు అంతా మరచిపోయినట్లుంది. లేకపోతే నన్ను పరీక్ష చేస్తోందో. సమావేశం అంతా అయ్యేవరకు అన్యమనస్కంగా అలోచిస్తూనే గడిపాను.

చివరలో లేచాను.దగ్గరగా వెళ్ళి “విమలా” అన్నాను.

“ఏ..స్” తనదైన శైలిలో అంటూనే వెనక్కి తిరిగింది.

“నాకూ..నేను…నాకు మీ ప్రపోజల్ ఇష్టమే!” అన్నాను.

“రెండు వారాలు అప్పుడే అయిపోయిందా..?” కొంటెగా అడిగింది.

నేను సమాధానం చెప్పేలోపునే”మా నాన్నగారు మీ ఇంటికి వస్తారండీ” అంది.

నాకు ఇంకా మాట్లాడాలనిపించింది. “అడ్రెస్ తెలుసా?” ఫెద్ద తెలివైనవాడిలా ప్రశ్నించాను.

“మీ ఇంటికి ప్రక్క వరలక్ష్మమ్మగారు మా పిన్ని” సూన్యంలోకి చూస్తూ సీరియస్ గా చెప్పింది.

“ఓర్ని…!”పైకే అనేసి గట్టిగా నవ్వేసాను. తను కూడా శృతి కలిపింది.

విమలకీ నాకూ మధ్య పెద్దగా ఇబ్బందులేవి రాలేదు. నాకు కావలసినదేమిటో తనకు తెలుసు. తనకు ఏది సానుకూలమో అది నాకు సమ్మతమవుతూ వస్తోంది.పదేళ్ళు వేళ్ళ సందుల్లోంచి ఇసుక రేణువుల్లా జారిపోయాయి.

“పిల్లలు!” “పిల్లలు”! “పిల్లలు”!–ఈ మధ్యన విమలని అతిగా ఆవరించుకుని విమలని కబలిస్తున్న సమస్య ఇది. ఆ ధ్యాసలో నన్ను కూడు ప్రక్కకి నెట్టేస్తోంది. నిజంగా ఓ స్త్రీకి పిల్లలు అంత ముఖ్యమా? ఏ వళ్ళు లేకపోతే జీవితం గడవడం ఎంత దుర్భరమా? ఏమో…ఈ నేపద్యంలోనే నరసమ్మ మనమరాలిని పెంచుకుందామంటూ రోజూ ప్రాణం తీసేస్తోంది. నేనూ అలోచిస్తున్నాను. ఒకవేళ చనిపోయారనుకున్న నరసమ్మ కుతురో, అల్లుడో తిరిగొచ్చి పిల్లని తిరిగడిగితే…అసలే సున్నిత మనస్కురాలైన విమల పరిస్తిథి ఏమిటి? విమల లేకుండా నా జీవితాన్ని నేనసలు ఊహించుకోను కూడా లేనే! స్పూను టక టకలాడింది. బాక్స్ మూసి లేచి కాస్త రిఫ్రెష్ అవుదామని బాల్కనీ వైపు నడిచాను.(ఇంకా వుంది) 🙂

5 వ్యాఖ్యలు

Filed under Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-45

ఈ పాటని నేను ఎం.ఎల్. వసంత కుమారి, కె.జె. జేసుదాస్ ,ఇంకా ఇద్దరు ముగ్గురు గొప్ప గాయకుల కంఠం నుండి విన్నాను. కాని ఇంత మాధుర్యంగా ఎవరిదీ అనిపించలేదు. బహుశా నేను విన్న సమయం అటువంటిదో. లేక మీకు కూడా అల్లాగే అనిపిస్తోదో, ఓసారి విని చూడండి. ఇంతకీ ఈ కంఠం ఎవరిదో నాకు తెలియక పోవడం నిజంగా నా దురదృష్టం. మీకు తెలిస్తే ప్లీజ్ !! చెప్పండి.

5 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

కార్నర్ సీట్-5

“సార్!మిమ్మల్ని ఓసారి పెద్ద సార్ కలవమన్నాడు” యాదయ్య పుష్పకం దింపేసాడు. ఇంక ఎడా పెడా అంకెలతోనూ, గణాంకాలతోనూ కుస్తీ మొదలన్న మాట.పెద్ద సార్ కి ఏది ఏ అకౌంట్లో మార్చి ఆడిట్ వాళ్ళని బుట్టలో ఎలా పడెయ్యాలా, అన్న తాపత్రయమెక్కువ పాపం!అందుకని నన్ను నాలుగైదు బుట్టల గురించి పదే పదే వాకబు చేస్తుంటాడు.

గంటన్నర అయ్యగారితో గుఫ్త్ గూ గుంజీలు తీసి ఎలాగో గురువుగారిని మెప్పించి ఒప్పించి బయటపడ్డా.ధభీమని కుర్చిలో వాలగానే ,ప్రత్యక్ష భగవానుడిలాగా యాదయ్య వచ్చి,”సార్! టీ”, అంటూ ఏదో అమృతం అందించినట్లు అందించేసాడు.

***

విమల “పెళ్ళి చేసుకుంటావా” అని అడిగిన మర్నాడే నేనిప్పుడు చేస్తున్న ఉద్యోగానికి అప్పోయింట్మెంట్ లెటర్ అందుకున్నాను.నా కిదంతా ఎక్సైటింగ్ గా మాయా లాగా అనిపించింది. నిన్ననేమో విమలలాంటి అమ్మాయి కోరి వలచాననడం.ఈ రోజున ఇంత మంచి కంపనీ లో అకౌంటంట్ జాబ్ రావడం. తట్టుకోలేకపోయాను. విమలతో మాట్లాడాలనిపించింది. కాని అడ్రెస్ తెలీదే. కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. ఎవరితో షేర్ చెయ్యాలో తెలియక, వేరే గత్యంతరం లేక అమ్మతో చెప్పేసా.

అంతా విని అమ్మ సాలోచనగా,’అదికాదురా! అంత ఊదరగొట్టే అమ్మాయి మనతో ఇమడగలదంటావా? ముఖ్యంగా నీతో! పోని ఉద్యోగం వచ్చిందిగా! ఇంకో సంబంధం చూసుకుంటేనేం?”అంటూ సాగదీసింది. నాకు తిక్క రేగి పోయింది. అంటే నేను చిన్న ఉద్యోగం చేస్తూనే వుంటే విమలని చేసుకోవచ్చన్న మాట.అప్పుడది మంచి సంబంధమే! ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది గనుక, విమల తనంతట తాను నన్ను కోరింది కనుక అమ్మ మనసు చాయిస్ కోసం వెతుకుతోందన్న మాట. నాకది ఎంత మాత్రం రుచించలా. ఏది ఏమైన విమల నాకు ‘లేడి లక్’ అని అనిపించింది.పైగా నాకు పైకి చెప్పలేక పోయినా విమల పట్ల ఆకర్షణ వుంది.సరే! మళ్ళీ వారం విమలని కలుసుకునే వరకూ ఈ విషయంలో తొందరపడకూడదూ అని నిర్ణయించేసుకున్నాను…

“ఛస్!” టీ డ్రాప్ చివరది షర్ట్ పై పడింది.గబ గబా వాష్ బేసిన్ వైపు నడిచాను.ప్రక్క సీటు అమ్మాయి అదే చిరునవ్వుతో కంప్యుటర్నిటక  టక పల్కరించేస్తోంది.   నేనూ నా ఫైల్స్ ఓపెన్ చేసి కళ్ళు పరుగెట్టించాను.

(ఇంకా వుంది)


4 వ్యాఖ్యలు

Filed under Uncategorized

కార్నర్ సీట్-4

అలవాటుగానే పుష్పకం నా బస్ స్టాపు దగ్గర క్రిందకి త్రోసేసింది. గబ గబా జనాలని నెట్టుకుంటూ బస్సు దిగేసేను. అక్కడినించి నా  ఆఫీసు పదడుగులే దూరం. గట్టిగా చెప్పాలంటే రెండో అంతస్థులోని కిటికి దగ్గర నా కార్నర్ సీట్ తెర చాటుగా దోబూచులాడుతున్నట్లు కనిపిస్తుంది కూడానూ! ఎక్స్టెర్నల్ డిస్టర్బన్స్ ఎక్కువగా వుంటుందేమోనని ఈ  కార్నర్  క్యాబిన్ ని తీసుకోడానికి పెద్దగా ఎవ్వరూ ఇష్టపడలేదు. నేను తప్పితే! అదేమిటో నాకు చిన్నప్పటి నుంచి కార్నర్లో నక్కి ప్రపంచాన్ని గమనించడమంటే భలే ఇష్టం! కలుగులో  కళ్ళొక్కటీ బయట పెట్టి కూర్చునే ఎలుక పిల్లలా!

“హై సర్! ఈవేళ మీకు మీ ఆవిడ మాడిన దోస పెట్టారు!” ముఖం మీదకీ వేలు పెట్టి ప్రక్క సీటు డేటా  ఎంట్రి ఆపరేటర్ నవ్వేస్తూ జ్యోస్యం చెపుతున్నట్లు  పల్కరించేసింది. ఓ నవ్వు నవ్వాను.ఈ అమ్మాయిలో విసుపు అనేది వుండదేమో. అసలు మిషను టక టకలాడిస్తున్నంత సేపూ నవ్వుతున్నట్లే అనిపిస్తుంది నాకైతే. అచ్చం ఒకప్పటి విమలలా…
***
‘మీకు వంట వచ్చా?’ హటాత్తుగా ఓ సాహితీ సమావేశంలో ఓ మూల కూర్చుని వున్న నాకు అది ఊహించని ప్రశ్న.
ఓ సారి చుట్టూ చూసాను. సభ్యులెవరూ ఇంకా రాలేదు. ముందుగా వచ్చింది నేను. నా తరువాత విమల.గత రెండు సంవత్సరాలుగా మేము ఆ సాహితీ సంఘంలో సభ్యులమే అయినా, ఇంచు మించులో ప్రతీ వారం కలుస్తూనే వున్నా నేనుగా విమలని ఎప్పుడూ పలుకరించింది లేదు. ఏదైన వ్రాస్తే చదవడమో, తను సెక్రెటరీ కనుక చదవడానికి అందించడమో అంతే! అంతే మా పరిచయం.
విమల సడన్ గా ఈవేళ ఇంత అసందర్బమైన ప్రశ్న ఎందుకు వేసిందో అని నేను నా పుష్పకమెక్కే లోపునే సమాధానం వచ్చేసింది.
“ఏమీ లేదు! నాకు వంట రాదు. మీకు ఇష్టమైతే  మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అయిటే మీకు వంట వస్తే నేను వంట మీ దగ్గర నించి నేర్చుకోవచును. లేకుంటే నేను సీరియస్గా వంట నేర్చుకోడానికి మూడు నెలలు పడుతుంది” అని పూర్తి చేసింది.
నాకు నవ్వు వచ్చింది. ఓ పక్క మతి పోయింది. అందరూ ‘విమల ఎంతో తెలివైన పిల్లా, ఎవరిని చేసుకుంటుందో’ ! అని చాలాసార్లు అనుకోవడం నేను విన్నాను. ఇవ్వన్న మాట తెలివితేటలు! తక్షణ కర్తవ్యం ఏవిటా… అని ఆలోచించి ‘నాకు రెండు వారాలు టైం కావాలి” అన్నాను.{ఏదో రెండు వారాల్లో వ్యవహారం చక్కబెట్టేవాడిలా! తీరా చూస్తే సరి అయిన ఉద్యోగం లేదు అప్పటికి…}
వి మల ముఖం మీద చిన్న అందైమైన చిరునవ్వు.”రెండు వారాలు కాదు రెండు నెలలు తీసుకోండి…”అంది.
“హమ్మయ్య” అనుకున్నా.
నా భావాలూ కనిపెట్టేసినట్లుంది.”ఈ లోపున నేను వంట నేర్చుకుంటా” అని వెక్కిరిస్తూ అనేసి  గబ గబా మిగతావారి కేసి అడుగేసింది. (ఇంకా వుంది)

6 వ్యాఖ్యలు

Filed under Uncategorized

మీనాక్షి కూనిరాగాలు-44

“మరే! మరే! మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసుకుంటూ,దేవులపల్లివారు కే.బీ.కే.మోహన్ రాజ్ గారి స్వరంలో వినిపించిన ఈ జీవన రహస్యాన్ని ఓ సారి పంచుకోవాలనుకుంటున్నా. చీకటిలో వెలుగులో మనని నడిపేది అగపడని సరంగొకడే!సంవత్సరాలదేముందిలెండి! ఫ్రకృతి కాంత శిగ పాయ చివరల నీటి బిందువులు అవి జారుతూనే వుంటాయి.పెద్ద లెఖ్ఖేమిటీ!గుండెల్లో వుండాల్సింది కులాసా…దిలాసా కానీ ! అలల మీద అలా అలా తేలుతున్నట్టు ఈ పాటకు కూర్చిన సంగీతం కూడా బావుంది కాదు! అన్నట్లు లింక్ ఇచ్చుట కొద్ది కొద్దిగా నేర్చితి సోదరా{ కార్తీక్}

3 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు