Monthly Archives: మే 2010

కార్నర్ సీట్ -7

రోడ్డంతగా రద్దీగా లేదు. ఏవో రెండు  మూడు  వాహనాలు తాపీగా సాగుతున్నాయి. ఎందుకో  తెలీదు నా ఆలోచనలకు కూడా కొంచం  అలసత్వం ఆవహించింది.విమల ధర్మమా అని  పొట్ట నిండిందిగా! అందుకేమో! టైం చూసాను రెండైంది. సర్లెమ్మనుకుని నా క్యాబిన్ వైపు నడిచాను.
ఈ ఆఫీసుల వాతావరణం చిత్రంగా వుంటుంది. ఎవరు ఎవరికి ఎప్పుడు ఆత్మీయులౌతారో చెప్పలేము.కాని ఈ ఫైళ్ళూ, కుర్చీలూ,కంప్యూటర్లు లాంటివి  మాత్రం ఎవరినైనా తమ వారిగా చేసుకుని వారికనుగునంగా పనిచేయగలవు. ఈ ఆలోచనతో పేలవంగా ఓ నవ్వు పెదవుల మీద కొచ్చింది.అది చూసి తనని పలకరించడానికి నవ్వాననుకుని అక్కడే వున్న చంద్ర శేఖర్ బదులిచ్చాడుఈ ఆఫీసుల వాతావరణం చిత్రంగా వుంటుంది. ఎవరు ఎవరికి ఎప్పుడు ఆత్మీయులౌతారో చెప్పలేము.కాని ఈ ఫైళ్ళూ, కుర్చీలూ,కంప్యూటర్లు లాంటివి  మాత్రం ఎవరినైనా తమ వారిగా చేసుకుని వారికనుగుణంగా పనిచేయగలవు. ఈ ఆలోచనతో పేలవంగా ఓ నవ్వు పెదవుల మీద కొచ్చింది.అది చూసి తనని పలకరించడానికి నవ్వాననుకుని అక్కడే వున్న చంద్ర శేఖర్ బదులిచ్చాడు .

ఈ  ఆఫీసుల్లో ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఓసారి పన్లో పడ్డక టైముతో పెద్దగా పని వుండదు–శరీరం సహకరించక పోతే తప్పితే!
“సర్ టీ”, మనవాడు ఠంచనుగా నాకు మూడున్నరికి టీ తెచ్చేస్తాడు. అలా తెమ్మని నేను వాడికి ఏనాడూ చెప్పలేదు. కంప్యుటరు మీద డేటా ఎంట్రి అపరేటర్ వేళ్ళు ఎంత యాంత్రికంగా ఆ పని చేస్తాయో,వాడు టైముకి టీ తేవడమూ అంతే. నే యాంత్రికంగా  పెదాలు సాగదీస్తే, వాడూ అలాగే బదులిచ్చి ముందుకెడతాడు. ఈ మద్యన విమలా అంతే. ఒక్క నరసమ్మ మనవరాలి విషయం చెప్పేటప్పుడు మాత్రం ఆ  కళ్ళు పూర్వపు మెరుపుని సంతరించుకుంటాయి. అసలు మా మద్య మాట్లాడుకోడానికి ఇంకేమి లేనట్లు  ఈమద్య అదే మాట్లాడుతోంది.పోనీ అని నే ఏ టీవీ వైపో పుస్తకం వైపు సంభషణని మార్చినా  దాంట్లోనిచి ఏదో తీగ లాగి, పోలిక లాగి మళ్ళీ యధవిధిగా నరసమ్మ మన్వరాలి వైపు లాక్కెడుతోంది. ఇన్నెళ్ళ మా అనుబంధాన్ని ఎనిమిది నెలల  ఆ పాప ప్రభావితం చేయగలుగుతోందంటే, విమల ఆ అమ్మాయి పట్ల ఎంత అభిమానాన్ని పెంచుకుంటోందో అర్థం చేసుకోగలను. కాని అది సానుభుతితో.అయితే మున్ముందు ఎదుర్కోబోయే ప్రాక్టికల్ ప్రాబ్లెంసిని మరచిపోయి తనలాగే  ఆ పిల్లని సొంతం  చేసుకునే ప్రయత్నం చేయాలన్నది విమల ఆశ,కోరికాను. ఇది ఎలా సాధ్యం? ఆఖరి సిప్ అయిపోయింది. చుట్టూ చూసాను! ఎవరి తల పైకి లేచి లేదు. చుట్టు చెక్క క్యాబిన్లు తప్పితే ఏమీ కనిపించట్లేదు.”హ్మ్! నేను కూడా తల వంచలి. వంచాను”.

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized