Monthly Archives: జూన్ 2010

కార్నర్ సీట్-10

ఇంటికి వెళ్ళేసరికి వీధి గుమ్మం తెరిచే వుంది.విమల ఎక్కడా లేదు. బహుస వంటింట్లో వుందేమో!నీరసంగా పడక్కుర్చీలో కూలబడ్డాను.కళ్ళు ముసుకోంగానే మళ్ళీ బస్టాపులో నే చూసిన దృశ్యమే నన్ను వెంటాడింది.అప్రయత్నంగా కళ్ళ వెంబడి నీళ్ళు కార్డం మొదలైయ్యాయి.తల పగిలిపోతోంది. వెలుతురుని ఏ మాత్రం కళ్ళు భరించలేక పోయాయి.కుడి చేతిని  నుదుటి మీదుగ వ్రేలాడేసి కళ్ళు మూసుకుని వెనక్కి వ్రాలాను.

ఎప్పుడు వచ్చిందో విమల  నా నుదుటి మీదనించి చేయి తప్పించి నుదురు వేడిగా వుందేమోనని చూస్తోంది.
“ఏవండి ఒంట్లో బాగా లేదా? నీరసంగా వుందా? ఎందుకలా పడుక్కున్నారు? కనీసం పిలవనన్నా లేదే!కాఫి తేనా…”ఒక్కసారి కళ్ళు విప్పి విమల కేసి చూసాను.ప్రొద్దుటి విమలకీ,ఇప్పటి విమలకీ ఎంత తేడా! నా గురించి ఎంత ఆత్రుత!విమల చేయి వేయగానే,చేతిలో వున్న  చంటిపిల్ల కూడా  నా నుదుటి మీద తన చిట్టి చేయి వేసింది. ఎందుకో తెలీదు   ఆ చేయి ఇప్పుడు ఎంతో స్వాతనగా చల్లగా అనిపించింది.విమల  నేను చికాకుగా ఫీలవుతానేమోనని ఆ చేతిని తప్పించబోయింది.నేను గబ్బుక్కున ఆ చేతిని తీసి నెమ్మదిగా అక్కడే పెట్టుకున్నాను.విమల ఆశ్చర్యపోతూ ప్రక్కనే వున్న కుర్చీని దగ్గరగా లాక్కుని,”ఏమి జరిగిందండీ?”అంటూ తల నిమిరింది.
విమల చేసిన పనినల్లా చంటిపిల్ల కూడా చేస్తోంది.అంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది. విమల చేతిలోంచి పాపని నెమ్మదిగా ఒళ్ళోకి తీసుకున్నాను. నేను చేసిన  ఈపని మరింత ఆశ్చ్ర్యపోయింది.మాట్లాడకుండా తన పెద్ద కళ్ళని మరింత పెద్దవిగా చేస్తూ నాకేసి చూసింది.
“విమలా! నీ కోర్కె ప్రకారం మనం ఈ పాపని పెంచుకుందాము. ఏ సంబంధం లేకపోతే ఈ పాప మన దగ్గరకెందుకు వస్తుంది?నీకు ఇంత దగ్గరౌతుంది?ఈ పాప చేయి వేసి నిమరగానే నాకు స్వాంతన గా ఎందుకనిపించాలి!నువ్వు నరసమ్మతో చెప్పు. నెమ్మదిగా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుందాము…”నేను మాట్లాడుతూనే వున్నాను. విమల గబుక్కున పాపని తీసుకుని గట్టిగా ముద్దు పెట్టేసుకుంది. ఆ సంబరంలో నన్ను కూడా వదిలిపెట్టలేదు.
“నాకు తెలుసండి మీరు ఒప్పుకుంటారనీ! ఈ రోజు నిజంగా ఎంత మంచి రోజండీ!నాకు మాటలు రావట్లేదు”అంటూ పొంగిపోయింది.చాలాకాలం తరువాత విమల కళ్ళలో అంత ఆనందాన్ని చూసాను.ఆనందంతో ఆమె కళ్ళు నీళ్ళు చిప్పిల్లుతున్నాయి కూడా!
నిజంగా ఈ రోజు మంచి రోజా?ఆ కార్నర్ సీట్ కుర్రాడు తను చనిపోయికూడా ఇంకొకళ్ళకి మంచి చేయగలడని నిరూపించుకున్నాడా?ఏమో తెలీదు.బ్రతుకులో ఏ ముడి ఎందుకుపడుతుందో…ఏ ముడి ఎందుకు విడిపోతుందో.
విమల నెమ్మదిగా తేరుకుని అప్పుడు మళ్ళీ అడిగింది.”అద్సరే! ఇంత మంచిడెసిషన్  తీసుకున్నప్పుడు మరి ఇంటికి వచ్చినప్పుడు అలా వున్నారేమండీ?ఆఫీసులో ఏమన్న గొడవ జరిగిందా?మీరు మనస్పూర్తిగానే ఈ డెసిషన్ తీసుకున్నారా?”
“లేదు…లేదు ఇది నేను మనస్పూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నాను.దీంట్లో   ఎటువంటి సందేహం పెట్టుకోకు.మిగిలిన విషయాలు ఇప్పుడు చెప్పలేను విమలా.ఒక కప్పు కాఫీ ఇవ్వవూ”,అంటూ మాట మార్చేసాను. ఎందుకో  ఆ కుర్రాడివిషయం   ఇ ప్పుడు విమల కి చెప్పాలనిపించలేదు.
“తప్పకుండానండీ. పాపని ఓ సారి పట్టుకోండి”,అంటూ వంటింట్లోకి బయలుదేరింది.నా చేతిలో గుండ్రని కళ్ళు అటూ ఇటూ త్రిప్పుతూ పాప!ఏవిటో తెలీదు నా కళ్ళకి ఆ క్షణంలో పాప కళ్ళు ఆ కుర్రాడి కళ్ళలానే అనిపించాయి. అప్పుడే వస్తున్న విమల కళ్ళ కేసి చూసాను. అదేమిటో ! ఆ కళ్ళు కూడా నాకు  అదే  పోలికలో కనిపించాయి.నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. చిరునవ్వుతో విమల చేతిలోంచి కప్పు అందుకున్నాను.

*************

(అయిపోయింది)

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized

కార్నర్ సీట్-9

.
నాలుగు అడుగులు గబ గబా  వేయగలిగాను గాని కాని తరవాత అడుగు ముందుకు పడలేదు. ఒక్కసారిగా  నిస్సత్తువ  నన్ను  ఆవరించేసింది. అక్కడ   చిమ్మిన  రక్తానికి   కళ్ళు  బైర్లు  కమ్మేసాయి.ఒక్కసారి ఓపిక తెచ్చుకుని   మూగివున్న జనం మధ్యలోంచి మరోసారి నిర్ధారించుకోడానికన్నట్లు ముఖం వంక పరికించి చూసాను.నేను చూసినది అబద్దం కావాలి అని పదివేలసార్లు కోరుకుంటూనే…కాని ఏమీ లాభం లేదు.నేను చూసింది అక్షర సత్యం.అతను…అతనే!బస్సు కింద  రక్తపు మడుగులో అతను.తట్టుకోలేకపోయాను.
ముఖం గబుక్కున ప్రక్కకి తిప్పేసాను.

“స్పాట్లో పోయాడు సార్! పాపం చాలా  మంచివాడు.నాలాంటివాళ్ళకెందరికో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంతో సహాయం చేసాడు. నాకు తెలిసి ఈ రోడ్ లో పాన్ డబ్బవాలా దగ్గరనించి చాలా మంది ఆయన వల్ల  సహాయం పొందినవాళ్ళే! ఏ మిటో బోల్డు డబ్బుంది! కాని నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు.ఎవరో చుట్టాలమ్మాయి ని   చెల్లెలని చేరదీసారు. ఈ   వీధి చివరే  ఇల్లు.అయ్యో చిన్నవాడు…నా ప్రక్కనున్న హొటల్  ఓనర్  అగకుండా దుఖం తో పూడుకు పోయిన  గొంతుకతో  మాట్లాడుతూనే వున్నాడు.నా కళ్ళు ఏమి చూస్తున్నాయో నాకే అర్థం కాలేదు.అటు వైపు మాత్రం  మళ్ళీ చూడలేక పోయాను. అతని గురించి ఏవేవో కష్టాలు  ఊహించుకున్నాను.కాని అతనికి ఏ మాత్రం సంబంధం లేని ఇలా  హఠాత్తుగపోయి ఇంత దుఖాన్ని కలిగిస్తాడనుకోలేదు.అసలు మానవ జీవితాలకి  మొదలూ తుది వుంటాయేమోకాని, మానవ సంబంధాలకి వుండవేమో.ఎందుకునాకింత బాధ ఎవరో ఆప్తులు పోయినట్లు. కేవలం కార్నర్ టేబుల్ రోజూ పంచుకున్నందుకేనా?కాదు…కాదు అంతకు మించినదేదో మా మధ్యన వుంది.ఇదే ఇంకెవరికన్నా అయివుంటే ఓసారి “అయ్యో” అనుకుని ముందుకి  సాగిపోయియుండేవాణ్ణేమో!అంతే కదా ఎవరైనా చేసేది!కానీ ఇతనికి నా అలోచనల్లోనో,ఊహల్లోనో స్థానం కల్పించి ఇతనికీ నాకు అనుబంధాన్ని నేసేసాను నేను.   కూడా చేసేడేమో! నాకేం తెలుసు! తెలిసినదల్లా       అతని   హఠాన్మరణం నన్ను కుదిపేసింది.ఓసారి వెనక్కి తిరిగి చూసాను. అక్కడ జరగాల్సినవన్ని జరిగిపోతున్నాయి.ఇంక అక్కడ ఆగి మాత్రం  నేను ఏం చేయగలను. నెమ్మదిగా ఇంటివైపు అడుగులేస్తున్నాను.ఇలాంటి సమయాల్లో  విమల కన్నా నాకు ధైర్యం చెప్పేవాళ్ళెవరున్నారు?

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

కార్నర్ సీట్-8

మా  ఆఫీసులో  ఏకాంతానికి  ఏమి  కొదవ లేదు. అసలు   అవసరం  పడితే ఒకటి రెండు పొడి ముక్కలు మాట్లడుకోడానికే టైం  దొరుకుతుంది.యాంత్రికత జుట్టు విరబోసుకుని స్వైర విహారం చేస్తుంది.అయితే నేను మాత్రం అదౄష్టవంతుడననే చెప్పాలి. నా ప్రక్క శీటు  డేటా ఎంట్రి ఆపరేటర్ మాత్రం నన్ను తనకి ఖాళి దొరికినప్పుడల్ల నన్ను పలకరిస్తూనే వుంటుంది .మాంచి చురుకైన పిల్ల…నా పుష్పకం నుండి నేను దిగే లోపలే చిలిపిగా పలకరించేసింది.
“ఏం సార్! మీ ఆవిడతో అంత సీరియస్గా పోట్లాడేరా?టైం అయిపోయినా సీటుకే అతుక్కుపోయారు?చ లో జీ…”అంటూ  నవ్వేసింది. నేనూ లేచి బస్ వైపు   అడుగులేసాను.ఇంటికెడితే విమల ఎల వుంటుందో…ఏముది ఆ చంటి పిల్లనెత్తుకుని అటూ  ఇటూ తిరుగుతుంటుంది.సరే కానీ… హమ్మయ్య ష్టాపు వచ్చేసింది. ట్రఫిక్ జాంలు గట్రా ఏమీ లేకుండా! బ్రతుకు జీవుడా! అన్నట్లు గోల్డ్స్టార్ టీ కార్నర్లో   కార్నర్ సీటు  నా కోసం ఎదురు చూడదూ!అడుగు ఆటోమటిక్ గా అటు పడింది. అలవాటైన బేరర్కి నే చెప్పేదేముంది. చిరునవ్వు రూవ్వి వాడు ముందుకి సాగడు.
ఇంకా ఆ ఆవారా బ్యాగ్ యువకుడు రాలేదేమిటిచెప్మ? ఎదురు సీటు ఖాళిగా వుంటే ఏదో వెల్తిగా వుంది.నాకు టీ వచ్చేలోపు వస్తాడేమోలే! ఏ ప్రైవేటు కంపనిలోనో పని అయివుంటుండి.పైన వాడు ఇంకా వదలకుండా పీక్కుని తింటున్నాడేమో! నా అలోచనలకి నాకే నవ్వొచ్చింది.ఎందుకు నేను అతనిని కష్టాల్లో వున్నట్లుగానే వూహించుకుంటాను. ఏం..తన ప్రియురాలితో కలిసి ఏ పార్క్లోనో ముచ్చట్లాడుకుంటూ వుండచ్చు కదా…

తాపిగా  విండోలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను.బస్సులు వస్తున్నాయి,అరక్షణం   ఆగినట్లే ఆగి పోతున్నాయి.ఈ టైంలో  ట్రాఫిక్ ఎలా వుంటుందో తెలీదూ? ఏమిటో  ఆ పరుగులు…ఎక్కడికో ఆ వురుకులు…అప్రయత్నంగా నవ్వొచ్చింది. టీ తీసుకొచిన బేరర్ కూడా  ఎందుకో ఓ సారి అటు చూసి నవ్వడు.
ఇంతలో పెద్ద శబ్దం. టీస్తాల్లో వున్న అందరూ బయటకు పరుగులు తీసారు. అందరూ గందరగోళంగా  మాట్లాడడం మొదలుపెట్టారు. “ఏం సార్ ఏదన్నా బాంబా.లేదా  మామూలుగా యాక్సిడెంటేనా. ఈ పాయింట్లో అలవాటేగా…ఎవరో అంటూ  నా ప్రక్క నించి ముందుకి సగిపోయాడు. ఎందుకో నా మనసు కీడుని శంకించింది…ఒకవేళ ఆ  కుర్రాడు కాదు కదా!…ఛ ఛ…వెధవ మనసు…మంచి అలోచనలే రావా ఎప్పుడూ…నా ఆదుర్దా నన్ను  నిలువనీయ లేదు.నిజానికి  నాకిలంటివంటే చాలా భయం . కాని మనసు ఊరుకోవడం లేదు.ధైర్యం చిక్కబట్టుకుని ఏమి జరిగిందోనని  ముందుకి నడిచాను.

4 వ్యాఖ్యలు

Filed under Uncategorized