మీనాక్షి కుర్కురే! (క్యా! మై ఝూట్ బోలి క్యా? -2)

క్యా! మై ఝూట్ బోలి క్యా?
ఆయ్! ఇడాకుల ఇషయానికీ, డైరెక్ట్రుగా వచ్చీసినామండి!ఆయ్! మరి పెద్దోళ్ళు కుదిర్సినవేమిటి,పిల్లమూకలు కుదుర్సుకున్నవేమిటి, అన్నింటిలోనూ ఒహటే తొందరపాటు కనిపిస్తోందండి! ఎందుకంటే మనువికి కొలబద్దలుగా ఈరంత డబ్బూ,డర్పం,దస్కం…ఇహ నే సెప్పలేండి. ఇసుంటివి సూసేసి, సేసేసుకుంటున్నారండి! అంతే! ఇహ అది మూన్నాళ్ళ ముచ్చట కాక మరేటౌతుందండి?అసలు కారణం నా ఎరికలో…ఆడాళ్ళు అదే మరి మన ఆడమళయళం…అదే ఆడమూకలు…ఆ..అదే..అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోందిటండీ…అసలూ! అది సంగంతి కాదేటండి మరి!అందుకు ఈ తొందరపాటు!
ఇహ పోతే అలా అయిన పెళ్ళిళ్ళలో ఇడాకులు పెద్ద ఇసేసమూ,ఇషయమూ నేటండి!అవుతాయి!ఇడాకులూ అవుతాయి!పెడమొకాలు అవుతాయి!అక్కడితో అయ్యిందా! మన సుట్టూ అనేకమంది పెద్దమడుసులుంటారారు కదేటండి! ఆరితో మా సిచ్చొక్కీసినాదండి బాబు!అంటేనండి ఇప్పుడూ…ఇడాకులు తీసీసుకుని అబ్బాయీ, అమేరికా పారెళ్ళినాడనుకోండి(ఎందుకైనా మంచిది అమ్మాయి ఎదురగకుండానండీ…)ఆయ్!ఇహ సేసేందుకు ఏటుందండీ డబ్బు యావ తప్ప!అది సూసేసి మన పెద్దమడుసులు ఈ అమ్మయెంటపడతారండి…ఆడు కొటి తేస్తే, నువ్వీడ కోట కట్టు! అదేందో…ఆ కలకటేరు అవ్వు! ఆడు నిన్ను సూసి ఏడ్వాలా…మరి నువ్వు ఆడ్ని సూసి ఏడ్వాలా…అని సెవ్వుల్లో జోరీగల మాదిరి ఒహటే నస!

ఆయ్! ఆడు కోట్లు సంపాదిస్తే ఈడ ఈ అమ్మాయికేటండి! ఈ అమ్మాయి డబ్బెనకమాలి ఎందుకు లగ్గెత్తాలండీ? అసలు ఆళ్ళెందుకు ఇడిపోయారో కనుక్కునీ, సాతనైతే ఒకింత సాయం సేయాలి,లేకుంటే మనకెందుకులెమ్మని నిమ్మలంగా ఘమ్మ్హని వుండాలి! అసలు ఆడికి డబ్బు పిచ్చి వుంటే ఈ పిల్లకి వుండాలని వుందేటంది! రూలిసు మాటాడితే మరి రూలీసేనండి! ఆడికి బంగల కావలనుకుంటే ఈ పిల్ల మరి సేపల బుట్టకాడే తొంగుంటాదండీ!అది కుదరదని లగ్గెత్తిస్తే ఏటౌతాదంది! ఆడో, ఇదో ఎవరో ఒకరు ఒకరినొకరు పొడిసేసుకుంటారండీ! నేకుంటే పొడిసేస్తారండి! అయ్ బాబోయ్! ఎవరినేటండి? అలా లగ్గెతించినందుకు తవరినేనండి! ఆయ్! అవునంటారా? కాదంటారా?ఓ సూరి ఇసయం తలకెత్తుకోండీ!పెద్దమడుసులూ…అలా మొకం సాటేస్తే ఎల్లాగా?
క్యా! మై ఝూట్ బోలి క్యా? బోల్ దీజియే “కొయినా…భై…కొయినా…”:)

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కుర్కురే!

ఆయ్! క్యా మై ఝూట్ బోలి క్యా?

 

ఆయ్! మరేమోనూ మనమేమో  కలుసుకుని సానా రోజులైపోతుండాది! బాగుండారా! మీ అసుంటి పెద్దమడుసుల్ని కలుసుకోవాలంటే, ఒకింత తీరిక, మరో కూసింత ఎసులుబాటు వుండాలి కాదెటండీ!మరందుకే, ఈలు కుదరనేదూ అని సెప్పుకుంటున్నాను.అద్సరేగాని!ఈ పెళ్ళిళ్ళు సేసేసుకోడం, మనం “హమ్మయ్య!అయ్యింది!!!” అనుకునే లోపుల్నే ఇడిపోడం!  సంగతి! ఆయ్! కారణమేటో తెలుసునేటండి మీకూ? ఆ! నా పిచ్చిగానీ మీరూ–పెద్దోరూ! మీకు నే సెప్పేదెమిటి గానీ! నాకూ తెలుసూ– అని నేననుకుంటే వొచ్చేసిన నష్టమేటీ పెద్దగా లేదనిపించీ, మరి మనం మన మనసులో మాట సెప్పేస్తున్నామండి!ఇషయం అర్థమైంది కాదేటండి! ఇహ రేపు ఓ పాలి ఈ ఇసయం మీద మీతో మొరీట్టుకుంటానండి! సెలవనేసుకుందామేటో!!కంగారుపడాల్సినదేటినేదండీ ఇసయం ! ఏదో ఒకింత ఊరుకో బుద్దికాక! మీ బాసలోనైతే బుద్ది లేకానూ…!

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కుర్కురే!

మీనాక్షి గరిటి గిరికీలు-సేమ్యా దోసె

 

ఏ మొక్క లేనప్పుడు ఆముదం మొక్కే, మహా వృక్షమండీ బాబు! అందుచేత,ఇంట్లో వున్న వస్తువులతో,మనం కూడా ఓ వంట సృష్టించేసాం.దీనిని ఇంతకముందు ఎవరన్నా చెప్పారో,చేసారో నాకు తెలియదు. నాకు అప్పటికప్పుడు తోచింది,చేసాను.ఇది చాలా వీజీ అండీ!ఓసారి చూడండి.
కావల్సిన పదార్ధాలు:-సేమ్యా-1కప్పు,బియ్యప్పిండి-2కప్పులు, పచ్చి మిర్చి-3,కొత్తిమీర, అల్లం-చిన్న ముక్క,ఉప్పు -తగినంత.
మూకుడులో రెండు చెంచాలు నూనె వేసి సేమ్యాని వేయించండి. తరువాత మూడు కప్పులు నీళ్ళు పోసి,సేమ్యాని ఉడికేలాగా చూడండి.సేమ్యా ఉడుకుబట్టిన వెంటనే దింపేసి,ఉప్పూ, పచ్చి మిర్చి,అల్లం, కొత్తిమీర కలిపేసి, బియ్యప్పిండిని కూడా కలిపేసి  దోసె పిండిలాగ తయారు చేసి దోసెలు పోయండి.ఉల్లిపాయలు మామూలే-కావలిసితే కలుపుకోండి.అన్నట్లు కాస్త పుల్లపెరుగు కూడా నీటితో కలిపితే బాగుంటుంది. ఇంతే సంగతులు–దోసె కడుపులోకి, మనం వీజి చైర్లోకీనూ!

1 వ్యాఖ్య

Filed under మీనాక్షి గరిట గిరికీలు

మీనాక్షి కూనిరాగాలు-48

 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా,
నా పిలుపులో నిలుస్తావటా,
ఆపదమొక్కుల స్వామీ,
నీ సన్నిధి నా పెన్నిధటా.

                                   ఒక పిలుపులో…

కొండంత దేవుడవని కొండంత ఆశతో
నీ కొండ చేర వచ్చాను,
కనికరించి కాఫాడుమయా…ఆ…

                                   ఒక పిలుపులో…

వడ్డికాసులవాడివటా,
వడ్డీ, వడ్డీ..గుంజుదువటా,
అసలులేనివారిమయ్య, కొసరు మాత్రమీయగలమా? ఆ…

                                    ఒక పిలుపులో…

3 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

శివ మానస పూజ


కార్తీక మాసం కదా! ఏదో మనకు తోచింది నలుగురితో పంచుకుంటే మంచిదని అనిపించి కమలమ్మగారి సౌజన్యంతో నాకు దొరికిన శివ మానస పూజ మీకందిస్తున్నాను.మీకు ఇదివరకే తెలిస్తే గుర్తు చేస్తున్నాను అనుకోండేం!

రత్నైహ్కల్పిత మాసనం హిమజలైహ్స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమ దామోదాంకితం చందనం|
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం|| 1

సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదిదం|
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్వా ప్రభోస్వీకురు|| 2

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా|
సాష్టాంగం ప్రణతిహ్ స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తమ్మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో|| 3

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాహ్ ప్రాణాశ్శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిహ్
సంచారహ్ పదయోహ్ ప్రదక్షణవిధిహ్ స్తోత్రాణి సర్వాంగిరో
యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభో తవారాధనం||4  

కరచణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో||

                                                                 శ్రీ మచ్చంకరాచార్య విరచితం

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

Log On To Kamalamma.com

నాకు పరిచయమైన వ్యక్తులలో నాకు స్పూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలబడ్డ స్త్రీలు చాలా మందే వున్నారు! ఒక్కొక్కరూ, నన్ను చాలా అబ్బురపరచి, వీళ్ళని చూసి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి అని అనిపిన్స్తుంది. అందులో కమలమ్మగారు ఒకరు! వయసు ఈవిడది ఇంకా డెబ్భై ఆరే! అయితే అవిశ్రాంతంగా క్రోషీయా సూది ఈవిడ చేతిలో కదులుతూనే వుంటుంది!అయితే చేతులెలా పని చేస్తుంటాయో అలాగే కళ్ళు టీవీని చూస్తుంటాయి-క్రికెట్ మొదలుగొని అన్ని భాషలలోనూ,అన్ని చానెల్స్లోని అన్ని ప్రోగ్రాంస్ ని ఒకేసారి కిచిడిలా చూసేస్తుంటారు.ఇంకా సుడుకోలు హిందు పేపర్లోవి పూర్తిచేస్తుంటారు. ఇవి కాక గడి-నుడి.మొత్తాని భలే అత్తమ్మ ఈవిడ!ఈవిడ కోడలుగారు  ఈవిడికి తీసిన ఫొటో నేను మీముందుంచుతున్నాను అంతే! ఇంతకీ ఈవిడ ఎవరో చెప్పలేదు కదూ! ఈవిడ మా రెండో అక్కకి శకుంతలకి (chakralawordpress.com)కి అత్తగారూ! నాకు అమ్మనూ!

1 వ్యాఖ్య

Filed under Uncategorized

మీనాక్షి కూనిరాగాలు -47

 

కలగంటినే నేను కలగంటినే
కలలోన తల్లిని కనుగొంటినే
ఎంత బాగున్నదో నా కన్నతల్లి
ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించె మళ్ళీ
                                   కలగంటినే…
మెడలోన అందాల మందారమాల
జడలోన మల్లికా కుసుమాల హేల
ఎంత బాగున్నదో నా కన్నతల్లి
ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించె మళ్ళీ

కలగంటినే…

 కంచి కామాక్షియా ,కాకున్ననేమి!
కాశి విశాలాక్షి కాకూడదేమి ?
కనుగొంటినే నేను కనుగొంటినే
ఆమె ఎవరో కాదు భారతమాత !
ఆమె ఎవరో కాదు భారతమాత!

  కనుగొంటినే  నేను కనుగొంటినే

కలలోన తల్లిని కనుగొంటినే

వ్యాఖ్యానించండి

Filed under మీనాక్షి కూనిరాగాలు